YS Jagan Rakshabandhan Tweet  : సొంత చెల్లెళ్లకే లేదు.. రాష్ట్రంలో సోదరీమణులకు అండగా ఉంటానన్న జగన్.. ట్రోల్ అవుతున్న ట్వీట్!

రక్షాబంధన్ సందర్భంగా మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ సొంత సోదరి షర్మిలను మరిచారు. ఆమె సైతం సోదరుడు జగన్ కు రాఖీ కట్టలేదు.

Written By: Dharma, Updated On : August 19, 2024 1:40 pm

YS Jagan-YS sharmila

Follow us on

YS Jagan Rakshabandhan Tweet : అన్నా చెల్లెలి బంధానికి ప్రతీక రక్షాబంధన్.ఎక్కడ ఉన్నా.. ఎంత దూరంలో ఉన్న సోదరుడికి రాఖీ కట్టడం కోసం సోదరి వస్తారు. అటువంటిది దగ్గరగా ఉన్న జగన్ సోదరి షర్మిల అటువైపు చూడలేదని తెలుస్తోంది.రాఖీ కట్టించుకునే అవకాశం ఉన్నా.. దానిని దూరం చేసుకున్నారు జగన్. అయితే అది వారి వ్యక్తిగత వ్యవహారం. కానీ పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత హోదాలో జగన్ రాఖీ శుభాకాంక్షలు ట్రోల్ అవుతున్నాయి. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని.. ఈ ప్రయాణంలో తాను మీకు ఎప్పుడు తోడు ఉంటానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే సొంత చెల్లి షర్మిలకు రాజకీయంగా, ఆర్థికంగాన్యాయం చేయని జగన్.. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ట్వీట్ చేయడం బిగ్గెస్ట్ జోక్ అంటూ సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. ఇప్పటికే జగన్ కు షర్మిల రాఖీ కట్టకపోగా.. జగన్ తాజా ప్రకటనతో ఇదే హార్ట్ టాపిక్ అవుతోంది.షర్మిల విషయంలో జగన్ చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆస్తిలో వాటా ఇవ్వలేదు. రాజకీయంగా ప్రోత్సహించేందుకు రాజ్యసభ సభ్యత్వం పదవి హామీ ఇచ్చారు. దానిని సైతం తుంగలో తొక్కారు. చెల్లి కష్టాల్లో ఉన్న పట్టించుకోలేదు. కనీసం ఆమెను చేరదీయలేదు. చివరకు ఆమె కుమారుడు పెళ్లికి కూడా వెళ్లలేదు. ఇవన్నీ రక్షాబంధన్ ప్రకటనతో హైలెట్ అవుతున్నాయి.

* అన్నకు అండగా షర్మిల
చెల్లెలి విషయంలో అన్నగా అండగా ఉండడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. కానీ అన్న కష్టాల్లో ఉంటే మాత్రం షర్మిల అన్ని విధాల అండగా నిలబడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి అహోరాత్రులు శ్రమించారు షర్మిల. అన్న జైలుకు వెళ్తే పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు ఏకంగా పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో ఊరువాడ తల్లితో కలిసి ప్రచారం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను పట్టించుకోలేదు. తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం ఆమెకు ఇవ్వలేదు.

* ఒక్క పదవి దక్కలే
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి పదవులు దక్కాయి. అసలు పార్టీతో సంబంధం లేని పరిమళ్ నత్వానికి కూడా పదవి ఇచ్చారు. గల్లీ లీడర్లకు కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు కల్పించారు. కానీ సొంత సోదరికి మాత్రం హ్యాండ్ ఇచ్చారు. మరో అధికారిక కేంద్రం ఉండకూడదని భావించారు. పూర్తిగా దూరం పెట్టారు.

* సునీతకు అండగా నిలవలే
మరో చెల్లి సునీత గురించి చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తండ్రి మరణాన్ని దిగమింగుకొని.. సోదరుడిని సీఎం చేసేందుకు సునీత తపనపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లెలు సునీతకు అండగా నిలవాల్సింది పోయి.. నిందితులకు కొమ్ముకాశారు జగన్. ఆమెను సైతం ద్రోహం చేశారు. సొంత చెల్లెళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, నేను ఉన్నానని భరోసా కల్పించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. అటువంటి వ్యక్తి రక్షాబంధన్ రోజు చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోందని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.