IAS officers transferred in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఉండడం కూడా విశేషం. గతంలో పనిచేసిన అధికారికి తిరిగి తిరుమల బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. సాధారణ బదిలీల్లో భాగంగానే ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించినట్లు తెలుస్తోంది. టీటీడీలో గత కొద్దిరోజులుగా జరిగిన పరిణామాలు నేపథ్యంలోనే.. గతంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారికి తిరిగి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
– మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు.
– రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ బాబును నియమించారు.
– ఏపీ రెవెన్యూ ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు.
– అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
– పరిశ్రమలతో పాటు కార్మిక శాఖ కమిషనర్ గా శేషగిరి బాబు నియమితులయ్యారు.
– కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరబ్ గౌర్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
– గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం, ఏపీ భవన రెసిడెన్ట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించారు.
– రెవెన్యూ కార్యదర్శిగా హరిజవహర్లాల్ నియమితులయ్యారు.
– మరోవైపు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘల్ బాధ్యతలు చేపట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండోసారి అధికారిగా నియమితులు కావడం విశేషం. అయితే గత కొద్ది రోజులుగా టీటీడీలో జరిగిన పరిణామాలతోనే కొత్త ఈవో వచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ పనితీరుపై విమర్శలు వచ్చిన క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలో మరికొందరు అధికారులపై కూడా బదిలీ వేటు పడుతుందని ప్రచారం సాగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.