Hardik Pandya Watch Price: టీమిండియా క్రికెటర్లకు సంపాదన విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదాయం ఒక రేంజ్ లో ఉంటుంది.. అంతటి ఆదాయాన్ని సంపాదిస్తున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉంటాడు. హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. అతడు భీకరమైన ఆల్ రౌండర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేస్తాడు. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా బౌలింగ్ చేస్తాడు. ఫీల్డింగ్ విషయంలో అతడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. పొట్టి ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన అతడు.. ఐపీఎల్ లో గుజరాత్ జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2024 సీజన్లో ముంబై అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. 2025 లో మాత్రం సత్తా చాటింది.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్నాడు. అతని మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆసియా కప్ కంటే ముందు టీమిండి ఆడిన పలు టి20 సిరీస్ లలో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించాడు. అన్నిటికంటే ముఖ్యంగా తనకు మాత్రమే సాధ్యమైన స్వాగ్ షాట్లు ఆడి అదరగొట్టాడు. ప్రస్తుత ఆసియా కప్ లో కూడా హార్దిక్ పాండ్యా ఇదే స్థాయిలో ప్రదర్శన చేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అభిమానులు తనమీద భారీగా అంచనాలు పెట్టుకోవాలని మైదానంలో దూకుడుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా. వీటికి నెటిజన్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నది.
అన్ని కోట్ల వాచ్
హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడు తన చేతికి ధరించిన వాచ్ వార్తల్లో నిలిచింది. ఆ వాజ్ ఖరీదు దాదాపు 20 కోట్ల వరకు ఉంటుంది. ఇది రిచర్డ్ మిల్లే అనే సంస్థ రూపొందించిన ఆర్ ఎం 27-04 మోడల్ ఇది.. ఈ వాచ్ లు ప్రపంచంలో 50 మాత్రమే ఉన్నాయి. ఈ వాచ్ ఖరీదు దాదాపు 20 కోట్లు.. అయితే ఆసియా కప్ ప్రైజ్ మనీ 2.6 కోట్లు మాత్రమే కావడం విశేషం. ఆసియా కప్ కంటే ఈ వాచ్ విలువ దాదాపు పదిరెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. హార్దిక్ ధరించిన వాచ్ గురించి మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. అతని అభిమానులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడని.. అలాంటప్పుడు ఆ ప్రతిఫలాన్ని అతడే అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.