TTD 2026 Budget Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ శనివారం వివరాలను వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు & కీలక నిర్ణయాలు
శ్రీవారి ముడుపు పత్రం: నగదు, నాణేల ఇబ్బందులు లేకుండా, యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులు చేసి ‘ముడుపు పత్రాలు’ పొంది, వాటిని హుండీలో వేసే కొత్త విధానానికి ఆమోదం.
Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్
అన్నప్రసాద భవనం: రిలయన్స్ సంస్థ విరాళంతో తిరుమలలో అత్యాధునిక వంటశాల, మరో అన్న ప్రసాద భవనం నిర్మాణం.
కమాండ్ కంట్రోల్ సెంటర్: దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, వసతి గృహాల భద్రతను పర్యవేక్షించడానికి తిరుపతిలో రూ. 10.75 కోట్లతో ప్రత్యేక కేంద్రం.
భద్రత: అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ. 8 కోట్లతో ఆధునిక స్కానర్లు, 700కు పైగా భద్రతా సిబ్బంది నియామకం.
విద్యా వ్యవస్థ: టీటీడీ విద్యాసంస్థల ఆధునీకరణకు రూ. 118.89 కోట్ల కేటాయింపు.
వకుళామాత ఆలయం: అక్షరాభ్యాసం కోసం ‘గోవింద అక్షరమాల’ కార్యక్రమం.
ప్రత్యేక ఆకర్షణలు..
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఈసారి ఉచితంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అలాగే, ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.