Top Personalities in the Country : ఎన్నికలతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో( social media) సరికొత్త సర్వేలు అంటూ దర్శనమిస్తుంటాయి. ఊరూ పేరు తెలియని సంస్థలు సైతం తమ సర్వేలు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. మరోవైపు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు. ఫలానా ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారు.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. ప్రతిపక్షం బలం పుంజుకోవడం లేదు.. ఇలా ఏవేవో చెబుతుంటారు. అయితే ఇందులో ప్రామాణికత, పారదర్శకత కొన్నింటికి మాత్రమే ఉంటాయి. అయితే ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత సర్వేలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ పేరిట సోషల్ మీడియాలో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది. దేశంలో టాప్ పర్సనాలిటీస్ పేరిట సాగుతున్న ఈ సర్వే ఏపీలో ఇద్దరు నేతల మధ్య.. వారం రోజులపాటు సోషల్ మీడియా వేదికగా సర్వే చేసినట్లు వెల్లడించింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
* జాతీయస్థాయిలో పెరిగిన పవన్ క్రేజ్
2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి( Telugu Desam Party) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. శత శాతం విజయాన్ని జనసేన సొంతం చేసుకుంది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ కు ఎనలేని క్రేజ్ పెరిగింది. జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : అటు జగన్.. ఇటు చంద్రబాబు.. మధ్యలో పవనూ అప్ డేటడే..
* పవన్ కంటే జగన్ ముందంజ..
ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ బాక్సాఫీస్( Global box office) పేరిట ఈనెల 21 నుంచి 28 వరకు ఒక సర్వే సోషల్ మీడియాలో నడిచినట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్.. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ప్రజాదరణ ఉందని సర్వే చేపట్టగా జగన్మోహన్ రెడ్డి ముందంజలో నిలిచినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి 63 శాతం మంది జై కొట్టగా.. పవన్ కళ్యాణ్ కు కేవలం 37 మంది మాత్రమే మద్దతు తెలిపినట్లు ఈ సర్వే చెబుతోంది. అయితే ఈ సర్వేను ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఇది ఫేక్ సర్వే అంటూ జనసేన శ్రేణులు కొట్టి పారేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వారు లేరని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ సర్వే పుణ్యమా అని ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది. అయితే మున్ముందు ఇటువంటి సర్వేలు సర్వసాధారణమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఈ సర్వేల పుణ్యమా అని నిజమైన ప్రజాభిప్రాయం చెప్పే సంస్థలకు సైతం నిలువ లేకుండా పోతోంది.
Range Matters…#YSJagan pic.twitter.com/ag96o8nruA
— Power_Ranger_Facts (@Neninthae_) May 30, 2025