Bhairavam Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి కొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి 2016వ సంవత్సరంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ‘గరుడన్’ సినిమాకి రీమేక్ గా భైరవం అనే సినిమా రూపొందింది… ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊరిలో వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి సంబంధించిన పత్రాలను, అమ్మవారి ఆభరణాలను కొట్టేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు ఆ టెంపుల్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతారు. మరి ఈ టెంపుల్ ను కాపాడటానికి వీళ్లు ఎలాంటి పాత్రలను పోషించారు. మొత్తానికైతే అసలు దొంగ ఎవరు అనేది పట్టుకున్నారా? లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ సినిమాకి యాజ్ ఇట్ ఈజ్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఫస్టాఫ్ కొంతవరకు సోసోగా అనిపించినప్పటికి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక భారీ ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ఇంటర్వ్యూల్ని ముగిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో హైప్ ను పెంచే సన్నివేశాలను పెట్టీ ఈ సినిమాను చిత్రీకరించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించే ప్రయత్నం అయితే చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంతవరకు యాక్టింగ్ అయితే బాగా చేశాడనే చెప్పాలి.
మొత్తానికైతే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసి కొంతవరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. ఒక దర్శకుడు తను ఏదైతే నమ్మి ఈ సినిమాని తెరకెక్కించాడో దానిని రీచ్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికి దర్శకుడు అక్కడక్కడ తడబడ్డట్టుగా అనిపిస్తుంది.
డైరెక్టర్ గత చిత్రాలు అయిన నాంది, ఉగ్రం సినిమాలు సైతం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే అవి ఒక టైప్ ఆఫ్ జానర్ లో నడిచే సినిమాలు ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇది ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానంలో దర్శకుడు విజయ్ కి ఉన్న అనుభవం సరిపోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకుడిని కొంతవరకు మెప్పిస్తుందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తనదైన రీతిలో నటించే ప్రయత్నమైతే చేశారు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో యాక్టింగ్ కొంతవరకు బాగా చేశారనే చెప్పాలి… ముఖ్యంగా ఆయన కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. ఇక మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపించాడు. అతని పాత్రికి కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
నారా రోహిత్ సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఈ సినిమాతో తన పాత్రతో మరోసారి తనను తాను నటుడిగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు… శంకర్ కూతురు అయిన అతిధి శంకర్ సైతం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేశారు… ఇక మిగతా ఆర్టిస్టులందరు సినిమాకి సపోర్ట్ చేస్తు చాలా బాగా నటించి ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు…
టెక్నికల్ అంశాలు…
టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఏ మాత్రం బాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అసలు ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించలేదు… ఇక సినిమాటోగ్రఫీ కొన్నిచోట్ల బాగా కుదిరినప్పటికి అక్కడక్కడ వాడిన షాట్స్ ప్రేక్షకుడిని కొంతవరకు విజువల్ గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాయి. ఎడిటర్ కొంత వరకు పర్లేదు అనిపించినప్పటికి కొన్ని సీన్లను షార్ప్ ఎడిట్ చేసే అవకాశం ఉన్నప్పటికి ఆయన చేయలేకపోయాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే కొంతవరకు ఓకే అనిపించాయి…
ప్లస్ పాయింట్స్
సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
మ్యూజిక్
అనవసరం సీన్స్
ఇల్లాజికల్ సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5