Homeఆంధ్రప్రదేశ్‌Jagan - Pawan - Chandrababu : అటు జగన్.. ఇటు చంద్రబాబు.. మధ్యలో పవనూ...

Jagan – Pawan – Chandrababu : అటు జగన్.. ఇటు చంద్రబాబు.. మధ్యలో పవనూ అప్ డేటడే..

Jagan – Pawan – Chandrababu : జనసేనానిని పవన్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అయినా పొలిటికల్ అప్డేట్ గానే ఉంటున్నారు. ఏపీలో జరిగే పరిణామాలపై రియాక్టవుతున్నారు. అయితే ఆయన సెడన్ గా వారాహి యాత్రకు సిద్ధపడుతున్నట్టు సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ముందస్తు సన్నాహాలు వేళ.. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాలతోనే ఆయన అలెర్టు అయినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ వెళ్లి పెద్దలతో చర్చలు జరపడం, మహానాడులో ముందస్తుగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేయడం, పవన్ వారాహి యాత్రకు సిద్ధపడుతుండడం చూస్తుంటే ముగ్గురు నేతల వ్యూహాలు ఇట్టే అర్ధమైపోతున్నాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది.

అటు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్ పొలిటికల్ ప్లాన్ పక్కగా సాగుతోంది. అందుకే ఇలా ముందస్తు ఆలోచన వచ్చిందో లేదో.. వారాహి యాత్రకు సన్నద్ధతను ప్రకటించారు. అందరి ఆలోచనలకు భిన్నంగా గోదావరి జిల్లాల నుంచే యాత్రకు సిద్ధపడుతుండడం కూడా ఒక వ్యూహమే. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ని ఖరారు చేసే పనిలో ఆ పార్టీ ఉంది. జనసేనకు గట్టి పట్టు ఉన్న గోదావరి జిల్లాల నుంచే వారాహి రధ యాత్రను చేపడతారు అని అంటున్నారు. సాధ్యమైనత త్వరలోనే ఈ యాత్ర ఉంటుంది అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే కచ్చితంగా నాలుగైదు నెలల సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే బరిలోకి దిగిపోవడం బెటర్ అని పవన్ భావిస్తున్నారు. అందుకే యాత్రను పట్టాలెక్కించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.

పవన్ ఇటీవల తన యాక్టివిటీస్ ను పెంచుకుంటూ వస్తున్నారు. అవి ఢిల్లీ సిగ్నల్స్ అన్న అనుమానాలున్నాయి. ఈ మధ్యనే మంగళగిరికి వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు. కేవలం సర్వే చేసే ప్రతినిధులనే కలిశారు. ఇతర నాయకులు, కార్యకర్తలతో గడిపింది తక్కువే. ఈ సర్వేలో సైతం గోదావరి జిల్లాల నుంచి ఊహించినదానికంటే సానుకూల ఫలితాలు రానున్నట్టు తెలిసింది. =జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో 36 శాతానికి పైగా బలం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో అక్కడ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడమే జనసేన ముందు ఉన్న కర్తవ్యం అని  జన సైనికులు భావిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. అటు వైసీపీ, ఇటు టీడీపీకి అందనంత దూరంలో ఉంది. దీనిని మరింత మెరుగుపరిచేందుకు పవన్ వారాహి యాత్ర దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు కుదరుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య ఓటు బదలాయింపుపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటకే లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారు. మరో కొద్దిరోజుల్లో యాత్ర రాయలసీమ లో ముగియనుంది. కోస్తాలో అడుగపెట్టనుంది. దానికి సమాంతరంగా గోదావరి జిల్లాలో పవన్ యాత్ర ప్రారంభం కానుంది. రెండింటినీ సమన్వయం చేసుకోవాలని ఇరు పార్టీల నాయకులు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular