‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్రం ఏర్పాటు కానుంది. ఇదే రోజు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాసిన వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వద్దు. ఎందుకంటే ఎవరికైనా అప్పుగా ఇస్తే ధనం తిరిగివచ్చి అవకాశాలు చాలా తక్కువ. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనక పోవడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయితే మాటలు అదుపులో ఉంచుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఏ రోజు ఏ పని ప్రారంభించిన వెంటనే పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల నుండి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. మాటల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపారులకు అనుకోకుండా ధనలాభం అవుతుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక సిద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. రోజువారి పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు పడతారు. కొత్త వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదు. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆలోచన ఈరోజు బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని పనులు ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. వీటికి స్నేహితుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వస్తాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ. రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేసే పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరియర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. అధికంగా మీరు ఆయన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ధన లాభం చేగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఊహించని దానికంటే వ్యాపారులు ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో చేపట్టిన కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో సమాజంలో గుర్తింపు వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు తోటి వారు సహకరిస్తారు. జీతం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయం పెరగడానికి మార్గం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొన్ని పనులు పూర్తికావడానికి సమయం పడుతుంది. అయితే చాలా వరకు ఓపికగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోతారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు అదనపు బాధ్యతలు చేపడతారు. దీంతో కాస్త బిజీగా మారిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా అంతంత మాత్రం గానే ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వద్దు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈరోజు వారు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు తెలివిగా పెట్టబడులు పెడతారు. దీంతో అధిక లాభాలు పొందుతారు. ప్రియమైన వారితో విభేదాలు ఏర్పడతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి రిస్క్ తీసుకోవద్దు.