WhatsApp : ప్రస్తుతం WhatsApp ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ యాప్ గా మారిపోయింది. ప్రతి స్మార్ట్ ఫోన్ లోనూ వాట్సాఫ్ కచ్చితంగా ఉంటుంది. ఆఫీస్ పనులు, కాలేజీ అసైన్‌మెంట్‌లు, స్కూల్ ఇన్ ఫర్మేషన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వరకు ప్రతిదీ WhatsApp ద్వారానే జరుగుతోంది. అయితే, ఎక్కువ సంఖ్యలో ఫైల్స్, ఫోటోలు, గ్రూప్ చాట్ హిస్టరీ పేరుకుపోవడం వల్ల WhatsApp ఫోన్ పై భారం పడుతుంది. దీని కారణంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మీ WhatsApp స్టోరేజ్‌ను సులభంగా ఎలా ఖాళీ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : అమ్మకానికి ఇన్‌స్టాగ్రామ్-వాట్సాప్? ఇంతకీ ఏం జరిగింది.
ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:
ఇక్కడ Android, iPhone వినియోగదారులకు ఇద్దరికీ ఒకే విధమైన ప్రాసెస్ ఉంటుంది. వేర్వేరు పరికరాలకు వేర్వేరు మెథడ్స్ లేవు. ఇక్కడ చెప్పే పద్ధతి రెండు పరికరాల్లోనూ పనిచేస్తుంది.
* ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* కుడి వైపున కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.
* సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* తర్వాత స్టోరేజ్ అండ్ డేటాకు వెళ్లండి.
* స్టోరేజ్ మేనేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ డేటాను ఫిల్టర్ చేసి, ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్న చాట్‌లు లేదా ఛానెల్‌లను సెలక్ట్ చేసుకోండి.
* వాటిని సెలక్ట్ చేసుకున్న తర్వాత, “ఐటమ్స్ డిలీట్ చేయి”పై క్లిక్ చేయండి.
మీ ఫోన్‌లో ఒకే ఫోటో లేదా వీడియో అనేక కాపీలు సేవ్ అయి ఉంటే, స్పేస్ కోసం అన్ని కాపీలను డిలీట్ చేయండి. డూప్లికేట్ ఫైల్స్ ఆప్షన్ మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. అక్కడ మీరు డూప్లికేట్ ఫైల్స్‌ను చూసి డిలీట్ చేయవచ్చు. WhatsApp నుండి అవసరం లేని అన్ని మీడియా ఫైల్స్‌ను డిలీట్ చేయండి. ఈ ఆప్షన్ ఫోన్ గ్యాలరీలో అందుబాటులో ఉంటుంది.
చాట్స్ హిస్టరీ డిలీట్ చేయండి
WhatsApp స్టోరేజ్ ఎక్కువగా చాట్ హిస్టరీ వల్ల కూడా నిండిపోతుంది. క్లియర్ చేయడానికి మీరు చాట్ హిస్టరీని డిలీట్ చేయాలి. దీని కోసం సంబంధిత చాట్‌ను ఓపెన్ చేయండి. కుడి వైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి. మీరు చాట్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌కు కూడా వెళ్లండి. ఇప్పుడు “మోర్”పై క్లిక్ చేయండి. “క్లియర్ చాట్ హిస్టరీ” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి చాట్ హిస్టరీని డిలీట్ చేయండి. గ్రూప్ చాట్‌లలో ఎక్కువ ఫోటోలు, వీడియోలు, చాట్‌లు ఉంటాయి. వాటిని సమయానుసారంగా డిలీట్ చేయండి ఫోన్ లో స్పేస్ పొందండి.
Also Read : వాట్సప్ వల్ల ఎలాంటి సమస్యలు రావద్దంటే ఇలా చేయండి