Rajamouli : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ ఒక స్టామినాని ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి దూసుకెళ్తున్నాడనే చెప్పాలి…మరి ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకి ఎలాంటి గుర్తింపు లభిస్తోంది. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రపంచవ్యాప్తం గా మంచి అంచనాలైతే ఉన్నాయి.
దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఆచి తూచి అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని సైతం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర వహించబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమాతో యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకునే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నాడు.
Also Read : మహేష్ కంటే రెండింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రాజమౌళి!
మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట రాబోయే సినిమాలన్ని పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఇక రాజమౌళి సినిమాలన్నీ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎలివేషన్స్, ఎమోషన్స్ ని భారీగా రంగరించి ఉంటాయి.
ఆయన ఎప్పుడూ అలాంటి సినిమాలు ఎందుకు చేస్తాడు అనే డౌట్ అయితే అందరికి ఉంటుంది…అయితే రాజమౌళికి ఎక్కువగా డ్రామా ఉండే సినిమాలు అయితే నచ్చవట…కన్నీళ్లు పెట్టుకునే సినిమాలు, పెతాసు సినిమాలు అతనికి పెద్దగా నచ్చవని అందుకే ఎమోషన్స్ ని ఎలివేషన్స్ ను భారీ రేంజ్ లో చూపిస్తూ ఒక సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమా తీయడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని గత కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు.
తనకి ఎమోషన్, ఎలివేషన్ అనేది వీక్నెస్ అని అందువల్లే అలాంటి సినిమాలు చేస్తూ ఉంటానని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరికి నచ్చడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి….చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా మహేష్ బాబు ను ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది.
Also Read : రాజమౌళి చేసిన సినిమాల్లో డివైడ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు ఇవేనా..?