Game changer : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఉదాహరణగా నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి చెప్పొచ్చు. తెలంగాణాలో ఏ సినిమాకి అయినా కనీసం విడుదలకు రెండు, మూడు రోజుల గ్యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తూ ఉంటారు. కానీ గేమ్ చేంజర్ కి రేపు విడుదల ఉండగా, నిన్న అర్థరాత్రి బుకింగ్స్ ప్రారంభించారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, AMB సినిమాస్, మల్కాజ్ గిరి సాయి రామ్ ఇలా ఎన్నో థియేటర్స్ లో ఈ చిత్రానికి మొదటి గంటలోనే హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి గంటలో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అని అంటున్నారు. ఇప్పటి వరకు #RRR కి కూడా ఈ రేంజ్ బుకింగ్స్ స్పీడ్ లేదని, ఊపు చూస్తుంటే కేవలం ఒక్క రోజులోనే ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయలకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని, మొదటి రోజు కచ్చితంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నైజాం ప్రాంతం నుండి వస్తుందని అంటున్నారు. ఒక్క రెండు రోజుల ముందు బుకింగ్స్ ప్రారంభించి ఉంటే ‘పుష్ప 2 ‘ 25 కోట్ల రూపాయిల షేర్ రికార్డు ని కూడా కొట్టేదని అంటున్నారు. కానీ విడుదలకు ఒక్క రోజు గ్యాప్ లో ఇంత స్పీడ్ బుకింగ్స్ ఉండడం సాధారణమైన విషయం కాదు, రామ్ చరణ్ క్రేజ్ కి ఉదాహరణ ఇదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఈ సినిమాకి 9 వేల షోస్ షెడ్యూల్ అయ్యాయి. వీటి నుండి సుమారుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో ఇంకా పూర్తి స్థాయి బుకింగ్స్ మొదలు కాలేదు. మొదలైతే ఈరోజు రాత్రి లోపు కేవలం ఇండియా వైడ్ బుకింగ్స్ గ్రాస్ 50 నుండి 60 కోట్ల రూపాయిలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఓపెనింగ్స్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఈ చిత్రానికి 50 లక్షలకు పైగా గ్రాస్ వచ్చిందట. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కేవలం ఒక్క వైజాగ్ సిటీ నుండే ఈ సినిమాకి నిన్న రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది.