Divvela Madhuri : తిరుమలలోనూ దువ్వాడ ప్రియురాలు మాధురి అదే పని.. కేసులు పెట్టిన పోలీసులు

ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట హల్ చల్ చేస్తోంది. జంటగా తిరగడంతో పాటు వరుసగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలుగు ప్రజలకు కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలను సందర్శించారు. అయితే అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మాధురి పై మూడు కేసులు నమోదు కావడం విశేషం.

Written By: Dharma, Updated On : October 11, 2024 10:13 am
Follow us on

Divvela Madhuri :  దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురిపై తిరుమలలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆమె తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. త్వరలో తాము పెళ్లి చేసుకుంటామని కూడా ఆమె ప్రకటించారు. దువ్వాడ వాణి తో విడాకులకు సంబంధించి కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆమె తిరుమల పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల పోలీసులు మూడు సెక్షన్ల కింద మాధురిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ తాము కష్టాల్లో ఉన్నామని.. మరింత కష్టాలకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేయడం విశేషం. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు ఆయన భార్య దువ్వాడ వాణి శ్రీనివాస్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రత్యేక శిబిరం కొనసాగించారు. చివరకు దువ్వాడ కొత్త ఇంటిని మాధురి పేరిట రాయడంతో.. వాణిని అక్కడి నుంచి పోలీసులు ఖాళీ చేయించారు.

* జంటగా తిరుగుతూ
ప్రస్తుతం ఆ ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి కలిసి ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఈ జంట హల్చల్ చేస్తోంది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీటికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు దువ్వాడ హీరోగా వాలంటీర్ అనే సినిమా యూట్యూబ్ ఛానల్ లో విడుదల అయ్యింది. హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ దువ్వాడ శ్రీనివాస్ లో ఉన్నాయని మాధురి ఇప్పటికే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏకంగా తిరుమల వెళ్లి మాధురి రీల్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

* రీల్స్ చేయడంతోనే
తిరుమల శ్రీవారి సన్నిధిలో తాము త్వరలో పెళ్లి చేసుకుంటామని మాధురి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాధురి పరిసర ప్రాంతాల్లో రిల్స్ చేయడం సంచలనం రేకెత్తించింది. అదంతా ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై టిటిడి విజిలెన్స్ అధికారులు స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మాధురి పై.తిరుమలలో ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ తీయడం నిషేధం. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని మాధురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.