Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన హోటల్ టాస్క్ బిగ్ బాస్ హిస్టరీ లోనే పరమ బోరింగ్ టాస్క్ గా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత సీజన్స్ లో ఈ టాస్క్ వచ్చినప్పుడు చాలా ఫన్నీ గా ఉండేది, కంటెస్టెంట్స్ తమ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. కానీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంతో మంది ఎంటెర్టైనెర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. కానీ టాస్క్ ని సక్సెస్ చేయలేకపోయారు. అయితే ఉన్నవారిలో కొంతమంది మాత్రం తమ క్లాన్ లోని తోటి కంటెస్టెంట్స్ పెద్దగా సహకరించకపోయినా బెస్ట్ ఇవ్వడానికి చాలానే ట్రై చేసారు. వీరిలో బెస్ట్ ఎవరో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇరు క్లాన్ లను లివింగ్ రూమ్ లోకి పిలుస్తాడు. ముందుగా రాయల్ క్లాన్ ని పిలిచి ‘ఓజీ క్లాన్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఎవరు, వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు’.
అప్పుడు రాయల్ క్లాన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించుకొని యష్మీ కి బెస్ట్ పెరఫార్మెర్ ట్యాగ్ ని ఇస్తారు. అలాగే వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ పృథ్వీ పేరు చెప్తారు. యష్మీ ఈ టైటిల్ కి నిజంగా అన్ని విధాలుగా అర్హురాలు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనకి ఇచ్చిన పాత్రలో లీనమై ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించి కడుపుబ్బా నవ్వించింది. ఈ ఒక్క హోటల్ టాస్క్ ఎపిసోడ్ తో ఆమె నామినేషన్స్ లో టాప్ 3 ఓటింగ్ లోకి వచ్చేసింది. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ గా నిల్చిన పృథ్వీ కి ఆ ట్యాగ్ అవసరం లేదేమో అని అనిపించింది. పృథ్వీ కూడా తన బెస్ట్ ఎంత ఇవ్వగలడో అంత ఇచ్చాడు.
ఈ టాస్క్ వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ ఓజీ క్లాన్ లో ఎవరంటే విష్ణు ప్రియ అని చెప్పొచ్చు. ఎంతసేపు పృథ్వీ తో పులిహోర కలపడం తప్ప ఈమె ఈవారం చేసిందేమి లేదు. అలాగే ఓజీ క్లాన్ ని కూడా రాయల్ క్లాన్ లో బెస్ట్ ,వరస్ట్ ఎవరో ఎంచుకొని చెప్పుమనగా, ఓజీ క్లాన్ సభ్యులు చర్చించుకొని బెస్ట్ పెరఫార్మర్ ట్యాగ్ రోహిణి కి ఇవ్వగా, వరస్ట్ పెరఫార్మెర్ ట్యాగ్ ని టేస్టీ తేజా కి ఇస్తారు. రోహిణి నిజంగా ఈ టైటిల్ కి అర్హురాలు అని చెప్పొచ్చు. ఆ క్లాన్ లో అవినాష్, హరితేజ, గౌతమ్ కూడా టాస్క్ లో అదరగొట్టారు. గౌతమ్ లైవ్ లో చేసింది సగం వరకు టీవీ టెలికాస్ట్ లో చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ గా ఆయన హీరో రామ్ ని అనుసరిస్తూ యష్మీ తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది టీవీ టెలికాస్ట్ లో ప్రసారం కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఓజీ క్లాన్ నుండి చీఫ్ కంటెండర్ గా మణికంఠ ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఇది టెలికాస్ట్ కానుంది.