https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఐ సినిమాలో విక్రమ్ లా కనిపించబోతున్నాడా..? మరి అభిమానులు ఒప్పుకుంటారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 02:43 PM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి ఆయన కంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ డైరెక్టర్ సరసన నిలవాలి అంటే పాన్ ఇండియాలో తనకంటూ కొన్ని సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇలాంటి ఒక భారీ అడ్వెంచర్ సినిమాకి తెర లేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయినప్పటికి ఈ సినిమా లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేశారట. ఇక సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇకమీదట ఈ సినిమాను తను ఎలా రూపొందిస్తాడనే దాని మీదనే చాలా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లో క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడట.

    అందులో ఒకటి ఫిజికల్ గా చాలా వీక్ ఉన్న క్యారెక్టర్ కాగా, మరొకటి చాలా దృఢంగా ఉన్న క్యారెక్టర్ గా తెలుస్తోంది. మరి ఈ రెండు క్యారెక్టర్లలో ఉన్న వేరియేషన్స్ మహేష్ బాబు ఎలా చూపిస్తాడు. ఐ సినిమాలో విక్రమ్ ఎలాగైతే బాడీలో చేంజ్ ఓవర్ ను చూపించాడో అలాంటి చేంజ్ ఓవర్ అయితే ఈ క్యారెక్టర్ కి కావాల్సి ఉంది.

    మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు అలాంటి చేంజ్ ఓవర్ చూపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో సత్తా చాటాలి అంటే మహేష్ బాబు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తేనే ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు రావడమే కాకుండా సినిమా కూడా అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసుకుంటుంది.

    కాబట్టి ఈ సినిమాల విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నటించి తీరాల్సిందేనని సగటు ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాజమౌళి సినిమా అంటే కొంచెం కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రాజమౌళి అందిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…