https://oktelugu.com/

Amaravati Capital: అమరావతిలో ఆ 30 మంది కీలకం.. ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఆర్డీఏ!

ఓటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అమరావతి రాజధాని నిర్మాణం. అందుకు తగ్గట్టుగానే ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తోంది. కేంద్రాన్ని ఒప్పించి 15 వేల కోట్ల సాయాన్ని పొందగలిగింది. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది.

Written By: , Updated On : October 18, 2024 / 01:03 PM IST
Amaravati Capital(2)

Amaravati Capital(2)

Follow us on

Amaravati Capital: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టింది. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు నిర్మాణానికి సంబంధించిన నిధుల సమీకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంపై ఫోకస్ చేసింది. ఇప్పటికే కేంద్రం 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏడిపి నుంచి ఆ నిధులను సర్దుబాటు చేసింది. అయితే ఆ మొత్తం తో చేపట్టబోయే పనులకు సంబంధించి సిఆర్డిఏ ఒక రిపోర్ట్ ను రూపొందించింది. అటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ పనుల ఖరారు కోసం కన్సల్టీల నియామకం చేసుకోవాలనే సూచనలు సైతం అందాయి సిఆర్డిఏకు. అమరావతిలో చేపట్టబోయే వేరువేరు పనుల కోసం మొత్తంగా 30 మంది కన్సల్టిల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే డిపిఆర్ ఆధారంగా పనులు ముందుకు సాగనున్నాయి.

* జంగిల్ క్లియరెన్స్ పనులు
కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రాథమిక జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ప్రధాన రహదారికి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేసి.. విద్యుత్తు దీపాలను వెలిగించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాడు అమరావతి కొత్త కళతో కనిపించింది. మరోవైపు అమరావతి పరిధిలోని 25 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 36 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఓ సంస్థ టెండర్ దక్కించుకుంది. వందలాది యంత్రాలతో పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఆ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. కొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి.

* కన్సల్టిల నియామకం
ఇంకోవైపు ఐఐటి నిపుణులు అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అమరావతి నిర్వీర్యం చేసింది. దీంతో ఆ ప్రాంతం ఒక చిట్టడవిలా మారింది. దాదాపు 25 వేల ఎకరాల్లో పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలు ఏపుగా పెరిగిపోయాయి. కీలక భవనాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు ఐఐటి నిపుణులు చెరువుల మారిన అమరావతిలో పడవల్లో ప్రయాణించి పరిశీలించాల్సి వచ్చింది. అయితే అప్పట్లో ఈ నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతకు పెద్దపీట వేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేవని తేలింది. యధా స్థానానికి అమరావతి నిర్మాణ పనులను తీసుకొచ్చి.. పనులు తిరిగి ప్రారంభించుకోవచ్చు అని నిపుణులు సూచించారు. దీంతో కన్సల్టీలను ఏర్పాటు చేసి.. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సి ఆర్ డి ఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.