AP Government (2)
AP Government: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు పార్టీకి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కానీ ప్రధాన సంక్షేమ పథకాలు ఏవి అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. సరిచేసే పనిలో ఉన్నామని.. ప్రజలకు అన్ని చేయాలని ఉందని.. కానీ చేయలేకపోతున్నామని చంద్రబాబు పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు. అయితే త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించనున్నారు. మే నుంచి ఈ సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అప్పటివరకు రాజకీయ వ్యూహాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* మరికొన్ని అరెస్టులు
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను( vallabhanani Vamsi Mohan ) అరెస్టు చేశారు. ఆయన 14 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి కొంతమంది అరెస్టులు జరుగుతాయని ప్రచారం నడుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఈ అరెస్టులు, కేసులు కొనసాగుతాయి. వీటిపైనే మీడియా దృష్టి అంత ఉంటుంది. రాజకీయ రచ్చ నడుస్తుంది. కొడాలి నాని అరెస్టు ఉంటుందని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోందని ఆరోపిస్తోంది. ఇంకోవైపు మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇతరులకు మద్దతు ప్రకటించింది తెలుగుదేశం. మార్చిలో ఈ ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అంటే మార్చి అంతా అలా గడిచిపోతుంది.
* ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్
మరోవైపు ఏప్రిల్ లో( April month) భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి దారుణంగా దెబ్బతీయాలని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీ నుంచి కీలక నేతలను కూటమి పార్టీల్లో చేర్పించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో ఓ ఐదుగురు.. రాజ్యసభ సభ్యుల్లో ఓ ముగ్గురు జంప్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగా తెరవెనుక ప్లాన్ జరుగుతోందని సమాచారం. ఏప్రిల్ నెలలో అలా రాజకీయ వ్యూహంలో గడిపేసి.. మే నెల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
* మత్స్యకార భరోసాతో సంక్షేమం ప్రారంభం
వాస్తవానికి ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసా( matsyakara Bharosa ) అందించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అదే నెలలో ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం. ఆ సమయంలో మత్స్యకారుల జీవనం భృతి కోసం 20వేల రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు మేలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాయం అందించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ వరకు రాజకీయ వ్యూహాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి.. మే నెల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నది కూటమి సర్కార్ ప్లాన్. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.