Gpay
G pay: కూరగాయలు అమ్మేవారి నుంచి లక్షల్లో బిజినెస్ చేసేవారు.. Money Transfer కోసం మొబైల్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.మొబైల్ లో ఉండే Phone pay, G pay తోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా క్షణాల్లో కావాల్సిన డబ్బు.. అవసరమున్న వారికి చేరిపోతుంది. అంతేకాకుండా పరిమితి లేకుండా.. ఎలాంటి ఛార్జీలు లేకుండా దీనిని ఉపయోగించేందుకు అవకాశం ఉండడంతో కోట్లాది మంది ఈ యాప్ లను ఉపయోగిస్తున్నారు. అయితే పై రెండు అప్లికేషన్లలో G pay ను ఎక్కువ వాడుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ యాప్ లో రివార్డ్ లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కిరాణ మర్చంట్ కు ఉపయోగిస్తే మినిమం క్యాస్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే ఈ G pay ఊపయోగించే వారికి మాతృ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.. అదేంటో ఒకసారి చూద్దాం..
Tehnology రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడంతా Artifician Intelligence ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతీ రంగంలో ఏఐ చొచ్చుకుపోవడంతో దీనిని ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోతుంది. లేటేస్టుగా గూగుల్ పే లోకి ఏఐ రాబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. త్వరలోనేG pay లో ఏఐ సేవలు ఉంటాయని పేర్కొంది. ఇవి అందుబాటులోకి వస్తే మనీ ట్రాన్స్ ఫర్ మరింత సులువుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు కాస్త మొబైల్ గురించి తెలిసిన వారు మాత్రమే G pay ను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి సంబంధిత వ్యక్తి కాంటాక్ట్ లేదా అమౌంట్ ను ఎంటర్ చేయడంలో తప్పిదాలు జరిగితే వేరే వాళ్లకు నగదు బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు కొందరు నిరక్షరాస్యలు జీ పే ను యూజ్ చేయడం వల్ల చాలా వరకు నగదును కోల్పోయారు. అయితే ఏఐ అందుబాటులోకి వస్తే ఆ సమస్య ఉండదని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఏఐ సేవల్లో భాగంగా వాయిస్ తో కాంటాక్ట్, అమౌంట్ ను ఎంటర్ చేసుకోవచ్చని అంటున్నారు.
అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా కూడా ఏఐ భద్రతను ఇస్తుందని తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఏ యాప్ లో దీనిని ఉపయోగించడం లేదు. మొదటిసారిగా గూగుల్ పే అందుబాటులోకి తీసుకువస్తుందని అంటున్నారు. అయితే Phone pay కంటే G payలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే కొన్ని కారణాల వల్ల అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అవి రికవరీ కావడానికి సమయం పడుతుంది. కానీ మిగతా యాప్ లో ఈ సమస్య ఉండదని కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమిస్తే గనుక ఈ యాప్ కు వినియోగదారులు పెరిగే అవకాశం ఉంది. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడానికి G pay రివార్డులు అందిస్తోంది రూ.5 నుంచి రూ. 50 వరకు అందించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కొంత మంది G pay కు కనెక్టయి ఉంటున్నారు.