CM Jagan : వైసీపీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై వేటు పడింది. ఈయన జగన్ అస్మదీయ అధికారి అని.. ఈయన ఉండగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసింది. కేంద్ర పెద్దలకు సైతం ఇదే విషయాన్ని విన్నవించింది. అయితే పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో డిజిపి పై వేటు ఉండదని అంతా భావించారు. నిన్న అమిత్ షా ఏపీకి వచ్చిన వేళ.. ఈరోజు ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్న తరుణంలో బిజెపి రాజేంద్రనాథ్ పై బదిలీ వేటు పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా నియామకమే నిబంధనలకు విరుద్ధమని.. కేవలం ఎన్నికల కోసమే ఆయనను దొడ్డిదారిన తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపించాయి.
2020 ఫిబ్రవరి 15న రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్చార్జి డిజిపిగా నియమితులయ్యారు. ఆయన కేవలం ఇన్చార్జ్ మాత్రమే. పూర్తిస్థాయిడిజిపి ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదేపదే లేఖలు రాసింది. బి
డీజీపి నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలు కూడా పట్టించుకోలేదు. కేవలం అస్మదీయుడు, ఆపై సొంత సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం అర్హతగా భావించి.. 11 మంది జాబితాలో చిట్టచివరిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆయనను అదే హోదాలో కొనసాగిస్తూ వచ్చారు. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో రాజేంద్రనాథ్ రెడ్డి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు.ఇవన్నీ నిజమని తేలడంతో రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు పడింది.
ఇప్పుడు కొత్త డిజిపి ఎవరన్న దానిపై బలమైన చర్చ నడుస్తోంది. ముగ్గురు డిజి ర్యాంక్ ఐపీఎస్ అధికారుల పేర్లు, వారి వివరాలకు సోమవారం ఉదయం 11 గంటల్లోగా ప్యానల్ జాబితా పంపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత ఐదేళ్లలో వారి ఏపీ ఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ల వివరాలను ప్యానెల్తో పాటు పంపాలంటూప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. అయితే ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా ప్రమోట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. వీరి ముగ్గురి పేర్లు ప్యానల్ జాబితాలో పంపించే అవకాశం ఉంది. వీరి ముగ్గురిలో ఎవరినైనా వద్దనుకుంటే.. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పేరును పరిశీలనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఏపీలో పోలింగ్నకు వారం రోజుల ముందు డిజిపి పై బదిలీ వేటు పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.