CM Jagan Fitness Secrete: నిత్యం నవ్వుతూ.. ప్రేమతో పలకరిస్తూ.. ఆప్యాయంగా ఉంటారు ఏపీ సీఎం జగన్. ఒక రాజకీయనాయకుడికి బిజీ లైఫ్లో భాగంగా నిత్యం ఒత్తిళ్లు.. టెన్షన్ తో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం ఎప్పుడూ కూల్ గా కనిపిస్తారు. ఎంతటి ఆందోళనకర పరిస్థితి ఎదురైనా సాధారణంగా సమాధానం చెప్తారు. జగన్ లో కోపాన్ని చూసింది చాలా తక్కువేనని ఆ పార్టీ కీలక నేతలు చెబుతూ ఉంటారు. మరి జగన్ ఇంత కూల్ గా ఉండడానికి కారణమేంటి..? ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు..? దినచర్యను ఏ విధంగా మొదలుపెడుతారు..?

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరైన సమయానికి భోజనం చేసే ఆస్కారం ఉండదు. అలాంటి అవకాశం ఉన్నా.. టెన్షన్ వాతావరణంలో తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. దీంతో ఉబకాయం బారిన పడుతారు. ఇలా సమయం లేకుండా భోజనం చేయడం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కానీ సీఎం జగన్ లో మాత్రం ఇలాంటివి కనిపించవు. కనీసం క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటూ డైట్ మెయింటేన్ చేస్తారు. కచ్చితంగా ఆయన ఆహారంలో ప్రత్యేక మెనూ ఉండడం వల్ల నిత్యం ఆరోగ్యంగా కనిపిస్తారు.
సీఎం జగన్ మిగతా పనులతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతారు. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు మామిడి తరుముతో చేసిన పులిహోరను ఎక్కువగా తీసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఈ మామిడి తురుము పులిహోరనే ఎక్కువగా తీసుకున్నారు. అదీగాక జగన్ ఎప్పుడు విజయవాడ వచ్చినా ఈ పుడ్ కచ్చితంగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలోనూ మామిడి పులిహోర ఉండేలా చూసుకుంటారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దినచర్య ఉదయం 4:30కే మొదలవుతుంది. 4:30 నుంచి గంటపాటు యోగా, జిమ్ వంటి వ్యాయామాలు చేస్తారు. ఆ తరువాత కాసేపు న్యూస్ పేపర్స్ లోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుంటారు. ఆ టైమ్ లో కేవలం టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. అయితే పాదయాత్ర చేసిన సమయంలో బ్రేక్ ఫాస్ట్ మొత్తానికే తీసుకోలేదు.

ఇక సమావేశాల్లో ఉన్నపుడు సీఎం చాక్లెట్ తీసుకుంటారు. మధ్యాహ్న సమయంలో రైస్ కంటే పుల్కాలు తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఒకవేళ అన్నం తింటే అందులో మటన్ కీమా ఉండేలా చూస్తారు. లేదా రాగి ముద్ద ఉండేలా చూసుకుంటారు. ఇక కండ పెరుగు లేనిదే సీఎం భోజనం ముగియదని సన్నిహితులు చెబుతూ ఉంటారు. డైలీ భోజనంతో పాటు చిత్రాన్నమంటే సీఎం కు చాలా ఇష్టం. అలాగే మొక్కజొన్న పొత్తులు లాంటివి వీలున్నప్పుడు తీసుకుంటారు. ఇక వీకెండ్ సమయాల్లో బిర్యానీ తింటారు. ఇందులో చేపల పులుసు, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలు తప్పనిసరిగా సీఎం మెనూలో ఉంటాయి.
ప్రతిరోజూ అనవసరమైన ఫుడ్ తినకుండా సాప్ట్ ఫుడ్ కే ప్రిపరెన్స్ ఇస్తారు. ఏదైనా అకేషన్స్, విరామం దొరికినప్పుడు మాత్రమే నాన్ వెజ్ వంటకాలను ఆరగిస్తారు. అయితే కాస్త ఫుడ్ హెవీ అనిపించిన ఆ మరుసటి రోజు వ్యాయామంలో కాస్తకష్టపడడానికి ట్రై చేస్తారు. ప్రతి రోజూ ఎంత ఆహారం తీసుకున్నా.. ఉదయం చేసే వ్యాయామం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల జగన్ ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపిస్తారు.
Also Read:KCR- BRS: మునుగోడు బరిలో టీఆర్‌ఎస్సా..? బీఆర్‌ఎస్సా..?.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ