Adipurush Movie: ఆదిపురుష్ మూవీ వివాదాల్లో చిక్కుకుంటుంది. ప్రధాన పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు వివాదాస్పదం అవుతుంది. దేశవ్యాప్తంగా దర్శకుడు ఓం రౌత్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెజిఎఫ్ ఫేమ్ మాళవిక అవినాష్ ఆదిపురుష్ దర్శకుడుని ఓ రేంజ్ లో ఏకిపారేశారు. రామాయణం చదవకపోయినా కనీసం ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు చూడలేదా అని ప్రశ్నిస్తున్నారు. రావణాసురుడు శివ భక్తుడు. ఆయనకు 64 కళల్లో నిష్ణాతుడు. ఆదిపురుష్ లో రావణాసురుడు పాత్ర గెటప్ బాగాలేదన్నారు.

బాలీవుడ్ దర్శకులు రామాయణాన్ని వక్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి నటులు ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. రామాయణం చదవకపోయినా కనీసం వాళ్ళు నటించిన చిత్రాలు చూడండి, అంటూ మాళవిక విమర్శలు గుప్పించారు. ఆదిపురుష్ చిత్రంలోని రాముడు, రావణాసురుడు గెటప్స్ పట్ల ఆమె పూర్తి నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాల విలన్ ని తలపించాడు. నుదుటన విభూది తప్పితే… రావణుడు అనిపించే ఒక్క ఫీచర్ ఆయన గెటప్ లో లేదు. రావణుడి నుదుటిపై మూడు నామాలు లేవు అని.. రావణుడికి జంధ్యం లేదు.. లెదర్ జాకెట్ వేశారని తప్పుపడుతున్నారు. ఇక రావణుడు ‘పుష్పక విమానంలో’ సీతను తీసుకెళ్లడానికి వస్తాడు. కానీ ఇక్కడ పక్షిని పెట్టడమే వివాదమైంది. ఇక రావణుడి వేషం ‘అల్లావుద్దీన్ ఖిల్జీలా’ తయారు చేశారు. రావణుడి కంటికి సుర్మా ఉండడం ఏంటని చాలా మంది బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
టీజర్లోని పదితలల సీన్ కూడా విపరీతంగా ట్రోల్ అవుతుంది. సంప్రదాయంగా రావణుడు అంటే పంచె కట్టు, ఒంటినిండా నగలు, కిరీటం,చేతిలో గద ధరించి రాజసానికి నిలువెత్తు రూపంలా ఉంటారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఆ పాత్రల్లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. రాముడు గెటప్ విషయంలో కూడా ఓం రౌత్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఇదేదో మోడ్రన్ రామాయణంలా ఉంది.

దేశవ్యాప్తంగా హిందూ వర్గాలు ఆదిపురుష్ మూవీలోని కొన్ని అంశాలను తప్పుబడుతున్నాయి. మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మంత్రి ఆదిపురుష్ నిర్మాతలను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఆదిపురుష్ విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్రభాస్ సైతం అసహనంగా ఉన్నారట. దర్శకుడిపై ఆయన కోప్పడ్డట్లు సమాచారం అందుతుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇచ్చిన ప్రభాస్ కి తాజా పరిస్థితులు మింగుడు పడడం లేదు.