16నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారి ఏం మార్పు ఏంటంటే?

  ప్రతీయేటా శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కరోనా మహమ్మరి కారణంగా పండుగలన్నీ కళతప్పిపోయింది. కరోనా ప్రభావం శ్రీవారిపై కూడా పడింది. ఈసారి వెంటవెంటనే రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వస్తోంది. కిందటి నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ సాదాసీదా నిర్వహించింది. Also Read: బాబు పోయాడు.. సీమకు ‘కరువు’ తీరింది మరీ! ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండుసార్లు బ్రహోత్సవాలను నిర్వహించాల్సి వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16 నుంచి 24వరకు మరోసారి […]

Written By: NARESH, Updated On : October 6, 2020 3:18 pm
Follow us on

 

ప్రతీయేటా శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కరోనా మహమ్మరి కారణంగా పండుగలన్నీ కళతప్పిపోయింది. కరోనా ప్రభావం శ్రీవారిపై కూడా పడింది. ఈసారి వెంటవెంటనే రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వస్తోంది. కిందటి నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ సాదాసీదా నిర్వహించింది.

Also Read: బాబు పోయాడు.. సీమకు ‘కరువు’ తీరింది మరీ!

ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండుసార్లు బ్రహోత్సవాలను నిర్వహించాల్సి వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16 నుంచి 24వరకు మరోసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా నివారణలో భాగంగా ఈసారి ఉత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

కిందటి నెలలోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎలాంటి ఆటంకాల్లేకుండా నిర్వహించింది. ఈనెలలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 15న అంకురార్పణ కార్యక్రమం చేపట్టనున్నారు. 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?

కరోనా నిబంధనలు పాటిస్తూనే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించడానికి పరిమితంగానే భక్తులను అనుమతించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ కరోనా పరీక్షలను తప్పనిసరిగా చేయడంతోపాటు నిబంధనల మేరకు గదులను కేటాయించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అయితే తిరుపతిలో ఇంకా కరోనా తగ్గముఖం పట్టలేదని తెలుస్తోంది.