https://oktelugu.com/

మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎట్టకేలకు పీఎం మోడీ అపాయింట్‌మెంట్‌ ఎట్టకేలకు దొరకింది. నేడు ఓ వైపు అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ జగన్‌ మోడీతో అపాయింట్‌మెంట్‌ కుదుర్చుకున్నారు. జగన్‌, మోడీ భేటీ 40 నిమిషాల పాటూ సాగింది. ప్రధానంగా ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా సాగినట్లు తెలుస్తోంది. Also Read: బాబు పోయాడు.. సీమకు ‘కరువు’ తీరింది మరీ! ఏపీ సీఎం జగన్‌ కేంద్ర కేబినెట్‌లో చేరుతున్నట్లు ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. కానీ.. ఈ భేటీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 / 01:43 PM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎట్టకేలకు పీఎం మోడీ అపాయింట్‌మెంట్‌ ఎట్టకేలకు దొరకింది. నేడు ఓ వైపు అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ జగన్‌ మోడీతో అపాయింట్‌మెంట్‌ కుదుర్చుకున్నారు. జగన్‌, మోడీ భేటీ 40 నిమిషాల పాటూ సాగింది. ప్రధానంగా ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా సాగినట్లు తెలుస్తోంది.

    Also Read: బాబు పోయాడు.. సీమకు ‘కరువు’ తీరింది మరీ!

    ఏపీ సీఎం జగన్‌ కేంద్ర కేబినెట్‌లో చేరుతున్నట్లు ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. కానీ.. ఈ భేటీలో రాజకీయ పక్షం అంశాలు ఏవీ చర్చకు రానట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన సాయం, జీఎస్టీ చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, దిశ సహా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఏపీ బిల్లులు 17 అంశాలను జగన్‌ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే.. వీటన్నింటికీ మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

    ప్రధానితో జగన్‌ భేటీ త్వరగా ముగియడం వల్ల.. రాజకీయ అంశాలపై చర్చ జరగలేదని తెలిసింది. ఢిల్లీ వర్గాల ఊహాగానాలకు తగినట్లుగా ఎన్డీయేలో చేరే అంశం కూడా చర్చకు రాలేదట. ఇప్పటిఏ వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉంది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకు వైసీపీ సై అంటూనే ఉంది. మొదటి నుంచీ బీజేపీ వైసీపీ మిత్రపక్షంగా కొనసాగుతూనే ఉంది.

    Also Read: 16నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారి ఏం మార్పు ఏంటంటే?

    అయితే.. జగన్‌ రెండు వారాల గ్యాప్‌లో రెండోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అటు వ్యవసాయ బిల్లు కానీ.. ఇటు విద్యుత్‌ బిల్లును కానీ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్నాయి. వీటిని నిరసిస్తూ ఇప్పటికే ఎన్డీయే కూటమి నుంచి రెండు పార్టీలు వెళ్లిపోయాయి. అయితే.. ఇప్పటికిప్పుడు వైసీపీ కూడా ఎన్డీయేలో చేరాల్సిన అవసరం అయితే ఏర్పడలేదు. అందుకే మోడీ వద్ద ఈ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. ముందు ముందు మాత్రం వైసీపీ ఎన్డీయేలో చేరే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.