https://oktelugu.com/

శూలశోధన: నార్కో ‘‘ట్రిక్స్ ” ఏమిటసలు?

  నార్కో అనాలసిస్ టెస్ట్.. ప్రస్తుతం అందరి నోళ్ళలో నానుతున్న పదం.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మ హత్య కేసులో ప్రధాన ముద్దాయి, మృతుని ప్రియురాలు రియా చక్రబర్తి కి  నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని విచారణాధికారులు కోర్టు అనుమతి కోరడం….సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో సంబంధిత వ్యక్తులందరిపై కోర్టు నార్కో టెస్ట్ కు అనుమతి ఇవ్వడం… ఇప్పుడు నార్కో అనాలసిస్ టెస్ట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 3:26 pm
    Follow us on

     

    నార్కో అనాలసిస్ టెస్ట్.. ప్రస్తుతం అందరి నోళ్ళలో నానుతున్న పదం.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మ హత్య కేసులో ప్రధాన ముద్దాయి, మృతుని ప్రియురాలు రియా చక్రబర్తి కి  నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని విచారణాధికారులు కోర్టు అనుమతి కోరడం….సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో సంబంధిత వ్యక్తులందరిపై కోర్టు నార్కో టెస్ట్ కు అనుమతి ఇవ్వడం… ఇప్పుడు నార్కో అనాలసిస్ టెస్ట్ పై దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది .

    Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?

    *నార్కో అనాలసిస్ టెస్ట్… అంటే
    కేసులో ఇతర ఆధారాలు దొరకనప్పుడు, అనుమానితుడు చెప్పేది నిజమో అబద్ధమో తెలియనప్పుడు,  నిర్దారించుకునేందుకు,తప్పనిసరి పరిస్థితులల్లో  హై ప్రొఫైల్ కేసుల్లో చేసే నిజనిర్ధారణ పరీక్షే “నార్కో అనాలసిస్ టెస్ట్ “. ఈ పద్ధతిలో రాబట్టే సమాచారం 90% ఖచ్చితమైంది. కానీ, కోర్టుల్లో సాక్ష్యంగా అనుమతించరు. మన దేశంలో నార్కో అనాలసిస్ టెస్ట్ చేసే ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఉన్నవి  రెండే . ఒకటి కర్ణాటకలో, రెండోది గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఉంది. నార్కో టెస్ట్ కు ముందు కోర్టు అనుమతి తప్పనిసరి.

    * ఎలా చేస్తారు ?
    ఏ వ్యక్తిపైనైతే నార్కో టెస్ట్ చేయాలనుకుంటారో, ఆవ్యక్తికి… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్, ఆడియో గ్రాఫర్, జనరల్ సైకాలజిస్ట్ సమక్షంలో నిపుణుడైన అనస్తీషియా డాక్టర్ ద్వారా ఈ డ్రగ్ ని ప్రయోగిస్తారు. ”సోడియం పెంతథోల్ “అనే డైల్యూట్ చేసిన డ్రగ్ ని వయసు, ఆరోగ్యరీత్యా,  మానసిక స్థితిని బట్టి 0.2ml నుండి 0.4ml మోతాదులో నరాల ద్వారా రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి మగత నిద్రలోకి (సెమీ కాన్షియస్)జారుకొని ప్రశాంతమైన హిప్నోటిక్ స్టేట్ లో ఉంటాడు.ఈ స్థితిలో రహస్యాలను దాచలేరు. ఆడిగినవాటికే సమాధానం చెప్తారు.  అప్పుడు ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ సంక్షిప్త ప్రశ్నల ద్వారా కావలసిన సమాచారాన్ని రాబడతారు. ఈ టెస్ట్ గంట నుంచి 4గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం నార్కో టెస్ట్ కు బలం చేకూర్చేందుకు, రాబట్టిన సమాచారం నిజమో కాదో నిర్ధారించుకునేందుకు అదే వ్యక్తికి “బ్రెయిన్ మ్యాపింగ్ “నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో డ్రగ్ వాడరు.  శరీరంలోని 8 ప్రాంతాల్లో అత్యంత సూక్ష్మ స్పందనలను కూడా గుర్తించే  8 ఎలక్ట్రానిక్ సెన్సర్లను అమర్చుతారు.  సంక్షిప్త ప్రశ్నలు సంధించి నాడుల(nurves) స్పందనను రికార్డు చేస్తారు. నిజం చెప్పినప్పటికంటే అబద్ధం చెప్పినప్పుడు నాడులు ఎక్కువ స్పందిస్తాయి.దీని ఆధారంగా, అతను ఉద్దేశ్యపూర్వకంగా చెప్తున్నాడా ? లేక దాచిపెట్టి చెప్తున్నాడా ? అనేది గ్రాఫ్ ద్వారా నిర్ధారిస్తారు.   నార్కో టెస్ట్ జరుగుతున్నంతసేపు ఫోరెన్సిక్ ల్యాబ్ లో పోలీస్ అధికారి లేదా విచారణాధికారిని ఉండనివ్వరు. ఏఏ ప్రశ్నలడగాలి, ఏ సమాచారం రాబట్టాలి అనేదానిపై ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ కు విచారణాధికారి నార్కో టెస్ట్ కు ముందు డెమో నిర్వహిస్తాడు. నార్కో టెస్ట్ పూర్తైన తర్వాత  ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఆడియో, వీడియో రికార్డింగ్ తో ఒక రిపోర్ట్ తయారు చేసి కేసును విచారించే పోలీస్ అధికారికి లేదా విచారణాధికారి అందజేస్తారు.

    *ఏ దేశాల్లో ఏ డ్రగ్  ?
    నార్కో అనాలసిస్ టెస్ట్ లో వాడే డ్రగ్స్ అన్ని…  మత్తును, గాఢ నిద్రను కలిగించి మనసును ప్రశాంత స్థితిలోకి చేర్చే నిషేధిత రసాయనాలు. వీటిని మనుషులపై ప్రయోగించినపుడు కేంద్ర నాడీ వ్యవస్థపై, ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయి. క్రమంగా వయసు మీరినకొద్దీ అనారోగ్యం పాలవుతారు. మతిభ్రమించడం, చూపు మందగించడం, నరాలపటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.అందుకే,  అరుదైన కేసుల్లో తప్ప మిగతా కేసుల్లో నార్కో టెస్ట్ లకు కోర్టులు అనుమతించవు. కాని, దేశ రక్షణకు సంభందించిన కేసుల విచారణలో , విచ్చిన్నకర కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాదుల విషయంలో దర్యాప్తు సంస్థలకు కోర్టు  అనుమతి అవసరం లేదు. మన దేశంలో “సోడియం పెంతథోల్”,అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల్లో “స్కాపోలమైన్”, రష్యా లో “SP117” వంటి సైకో ఆక్టివ్ డ్రగ్స్ ని నార్కో టెస్టుల్లో వినియోగిస్తారు.ఇవి కొద్ది నిముషాలపాటు గాఢ నిద్రను కలిగించే అల్ట్రా షార్ట్ ఆక్టింగ్ బార్బిట్యురేట్ రసాయనాలు. ఇవి అమ్మడానికి, కొనడానికి, రవాణా చేయడానికి అనుమతిలేని నిషేధిత డ్రగ్స్. వీటిని నార్కో అనాలసిస్ టెస్ట్ కు ముందు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పర్మిషన్ తో సేకరిస్తారు. ప్రస్తుతం,  రాకేష్ ఆస్తానా (1984 బ్యాచ్, గుజరాత్ క్యాడర్ )NCB డి జి తోపాటు, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు .

    Also Read: రాహుల్ హడావుడి.. అంతేనా? కొత్తదేమీ కాదా?

    *నార్కో టెస్ట్ ఎప్పుడు వాడుకలోకి వచ్చింది  ?
    టెక్సాస్ ప్రసూతి వైద్య నిపుణుడు రాబర్ట్ ఎర్నెస్ట్ హౌస్ 1922లో నార్కో అనాలసిస్ టెస్ట్ విధానాన్ని కనుక్కున్నాడు. ప్రసూతి సమయంలో నొప్పులు తగ్గించేందుకు “స్కాపోలమైన్ “అనే డ్రగ్ ని ప్రయోగించగా మగత నిద్రలో బాలింతలు నిజాలు చెప్పడాన్ని గుర్తించాడు. అప్పటినుంచి వివిధ దేశాలు నెరపరిశోధనల్లో వివిధ రకాల డ్రగ్స్ ని వినియోగిస్తున్నాయి.

    *మన దేశంలో…
    యాదృశ్చికంగా 2008లో నార్కో అనాలసిస్ టెస్టులు ఎక్కువ జరిగాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ లష్కరే – ఇ – తాయిబా టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యుడు, ముంబై అట్టాక్ (2008)లో పట్టుబడిన మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ కు నార్కో అనాలసిస్ టెస్ట్ చేశారు. నోయిడా లో ఆరుషి మర్డర్(2008) కేసులో ప్రధాన అనుమానితుడు, సాక్షి అయిన కృష్ణ కు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న కు కరీంనగర్ పోలీసులు (2008) నార్కో టెస్ట్ కోసం కోర్టును అభ్యర్థించగా అనుమతివ్వలేదు. 2001లో 32కోట్లతో బిచాణా ఎత్తేసిన కృషి బ్యాంకు వెంకటేశ్వర రావ్ అలియాస్ కొసరాజు వెంకటేశ్వర రావ్ కు నార్కో టెస్ట్ చేశారు . 2019లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఏ పి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన తండ్రి వై ఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో నలుగురిలో ముగ్గురికి నార్కో టెస్ట్ నిర్వహించగా ఒకరు తిరస్కరించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ జిల్లా లో గత నెల 14న హత్యాచారానికి గురైన యువతి కేసుతో సంబంధం ఉన్నవారికి, యువతి కుటుంబ సభ్యులకు ఉత్తరప్రదేశ్ కోర్టు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చింది.

     
    – శ్రీరాముల కొంరయ్య