Vallabhaneni Vamsi: వైసిపి పరిపాలన కాలంలో ఏపీలోని మంగళగిరిలో తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో వైసిపి నాయకులు వీరంగం సృష్టించారు.. నాడు ఆ దాడిలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు ఉన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో కొంతమంది వైసిపి నాయకులు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు..
నాడు తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే సత్య వర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో వల్లభనేని వంశీ బెదిరింపులకు గురిచేయడం.. అపహరించడంతో అతడు కేసు విత్ డ్రా చేసుకున్నాడని టిడిపి నాయకులు ఆరోపించారు. వీటిని వైసీపీ నాయకులు తిప్పికొట్టారు. అయితే ఇప్పుడు సత్య వర్ధన్ ను అపహరించాడని అభియోగాలు మోపుతూ ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని గురువారం హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని భారీ బందోబస్తు మధ్య విజయవాడ తీసుకొచ్చారు. ఆ తర్వాత అతని విజయవాడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి.. ఆ తర్వాత జైలుకు పంపించారు. అయితే ఈ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మోపారని తెలుస్తోంది. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం కొత్త కొత్త వీడియోలను తెరపైకి తీసుకువస్తుంది. అందులో ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఆ వీడియోలో వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారాయి.
ఆ వీడియోలో ఏముందంటే
టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం నాయకులు తెరపైకి తీసుకువచ్చిన వీడియోలో వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఆయన కూటమి నాయకులకు ఓపెన్ సవాల్ విసిరినట్టు తెలుస్తోంది.. తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని, కొడాలి నాని కూడా ఎందుకు జైల్లో వేస్తారని వంశీ ప్రశ్నించారు. తనను ఏమీ చేయలేరని? ఏవైనా అక్రమాలకు పాల్పడితే.. అన్యాయాలకు తెగబడితే అరెస్ట్ చేస్తారని.. తనను అరెస్టు చేసే సీన్ చంద్రబాబుకు లేదని..లోకేష్ కు అసలు లేదని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వల్లభనేని అరెస్ట్ అయిన నేపథ్యంలో టిడిపి అనుకూల నెటిజన్లు అత్యంత వ్యూహాత్మకంగా ఈ వీడియోను వెలుగులోకి తెచ్చారు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు..” నాడు బీరాలు పలికాడు. అరెస్టు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టు అయ్యారు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. అందువల్లే ఎగిరెగిరి పడకూడదు. కర్మ ఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. రాజకీయ నాయకులు హుందాతనాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ప్రజలు వారిని అభిమానిస్తారు. అందుకే నేతలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల అభిమానాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని” తెలుగుదేశం పార్టీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యలు చేస్తున్నారు.
నన్ను, నానిని ఎవడు రా అరెస్ట్ చేసేది.. మింగలేక మంగళవారం అన్నాడు..
కట్ చేస్తే, విజయవాడ సబ్ జైల్ లో, గుడివాడ గుట్కా గాడి కోసం ఎదురు చూస్తున్నాడు pic.twitter.com/XNd40SvBOi— Bhavya (@unexpected5678) February 14, 2025