https://oktelugu.com/

Visakhapatnam: విశాఖ ముగిసిన అధ్యయనం జగన్!

గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వరు చంద్రబాబు.అసెంబ్లీలో చట్టం తెస్తారు. కీలక నిర్మాణాలు పూర్తి చేస్తారు. రాజధానిగా ఒక రూపాన్ని తీసుకొస్తారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 6, 2024 / 12:30 PM IST

    Visakhapatnam

    Follow us on

    Visakhapatnam: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టింది. ఫలితాలు వచ్చిన నాడే సిఆర్డిఏ అధికారులు అమరావతి రాజధాని ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను, ముళ్ళ కంపలను తొలగించారు. విద్యుత్ వెలుగులు తెచ్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. అమరావతిలో నిర్మాణాలపై అధికారులు నివేదిక ఇచ్చారు. అదే నివేదికతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దల సాయాన్ని అర్థించారు. అమరావతి నుంచి వెళ్లిపోయిన సంస్థలు తిరిగి రావడం ప్రారంభించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ ఈ ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్మించడం ఖాయం. అందుకే విశాఖ రాజధాని అంశం ముగిసిన అధ్యయనమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

    గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వరు చంద్రబాబు.అసెంబ్లీలో చట్టం తెస్తారు. కీలక నిర్మాణాలు పూర్తి చేస్తారు. రాజధానిగా ఒక రూపాన్ని తీసుకొస్తారు. భవిష్యత్తులో జగన్ తో పాటు ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని మార్చేందుకు సాహసించని పరిస్థితికి తేనున్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండటంతో వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. మొన్న రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు కనుక జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చినా..అప్పటికే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది కనుక.. దానిని కదిలించే ప్రయత్నం చేయరు. దానిని కదిలించే ప్రయత్నం చేయడంతో ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకున్నారు ఆయనకు తెలియంది కాదు.

    వాస్తవానికి రాజధాని తరలింపు అన్నది అంత ఆషామాషీ కాదు. మొన్నటికి మొన్న విభిన్న రాజకీయ కోణాలతో ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో కలుగ చేసుకోలేదు. కానీఒకసారి రాజధాని నిర్మాణం పూర్తయితే మార్పు అంత ఈజీ కాదు. పార్లమెంట్ లో చట్టం చేయాలి. సభ ఆమోదం పొందాలి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఆలస్యంగా రాజధాని నిర్మాణం ప్రారంభించింది. అన్ని పనులు నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. అందుకే జగన్ విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయి. శాశ్వత భవనాలు అందుబాటులోకి వస్తాయి. మరి రాజధాని మారుస్తామన్న ఆలోచన కూడా రాదు. ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చినా క్యాంపు కార్యాలయంతో విశాఖను సంతృప్తి పరచవచ్చు. అయితే అమరావతిలో శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి కనుక.. విశాఖ వెళ్లేందుకు కూడా ఛాన్స్ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ రాజధాని ముగిసిన అధ్యయనం.