AP Budget 2025: ఏపీ ప్రభుత్వం( AP government) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఓటాన్ బడ్జెట్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇది అంకెల గారడీగా ఉందని ఆరోపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను పొగడ్తలతో ముంచేత్తడానికే ఈ బడ్జెట్ తెచ్చినట్లు ఉందని ఎద్దేవా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆత్మ స్తుతి పరవింద తప్ప అందులో ఏమీ కనిపించడం లేదని చెబుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
Also Read: ఏపీ బడ్జెట్.. అందరికీ ఆరోగ్య బీమా.. రూ.25 లక్షల వైద్య సేవలు!
* మండిపడిన బొత్స
మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చట్టసభల్లో సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉందని.. కానీ ఎన్నడూ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటి పొగడ్తలు చూడలేదని చెప్పుకొచ్చారు. ఇది కొత్తగా సంప్రదాయం అన్నట్టు వ్యవహరించారని తప్పుపట్టారు. బడ్జెట్ ప్రసంగంలో అన్నిసార్లు చంద్రబాబు, లోకేష్ లను పొగిడారు అర్థం కాలేదన్నారు. ఎన్నికల హామీలు పై మాత్రం కేటాయింపులు లేవని ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.
* విపక్షం పెదవి విరుపు
సంక్షేమ పథకాల( welfare schemes) కేటాయింపులపై పెదవి విరిసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000, నిరుద్యోగులకు ₹3,000 భృతి, రైతులకు 20వేల భరోసా అని చెప్పారని.. కానీ కేటాయింపులు చూస్తుంటే మాత్రం నమ్మశక్యంగా లేదని అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. వారికి తల్లికి వందనం కిందట నగదు సాయం చేయాలంటే 12 వేల కోట్లు అవసరం అన్నారు. కానీ కేటాయింపులు చూస్తే 9,400 కోట్లు మాత్రమే ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. అంటే భారీగా సంక్షేమ పథకాలలో కోత ప్రారంభించారని తప్పుపట్టారు. పథకాలు ఆలస్యం అయ్యాయని.. కానీ ఇప్పుడు కేటాయింపుల్లో కూడా కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
* అంతమంది రైతులకు అవే కేటాయింపులా
రాష్ట్రంలో 52 లక్షల మందికి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అందించినట్లు వైయస్సార్ కాంగ్రెస్. వారందరికీ అన్నదాత సుఖీభవ కింద నగదు సాయం చేయాలంటే 12 వేల కోట్లు అవసరమని తెలిపారు. కానీ బడ్జెట్లో కేటాయించింది నామ మాత్రమే అన్నారు. మహిళలకు అట్టహాసంగా ఉగాది నుంచి బస్సు అన్నారని.. దీనిపై ఎక్కడా ప్రస్తావన లేదని చెబుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అసలు బడ్జెట్లో ఉత్పాదక రంగానికి కేటాయింపులు లేవని.. ఇది దారుణ వంచన అని ఆరోపించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. మొత్తానికి అయితే మండలిలో బడ్జెట్ పై గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
Also Read: కూటమిపై జ‘గన్’.. బడ్జెట్‌లో బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఏపీ సర్కార్