Nikhil: బుల్లితెర పై సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన నిఖిల్(Nikhil Maliyakkal), బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చి టైటిల్ విన్నర్ గా బయటకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్నన్ని రోజులు నిఖిల్ ఎంతో మంచి మనసు ఉన్నవాడిగా జనాల అభిమానాన్ని చూశాడు. అంతే కాకుండా హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇతని వెంట అమ్మాయిలు ఎలా తిరిగేవారో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్ట్రాంగ్ అమ్మాయి అనిపించుకున్న యష్మీ(Yashmi Gowda) ఏ రేంజ్ లో వెంటపడిందో మనమంతా చూసాము. అంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే ఇతనేంటి రిజెక్ట్ చేస్తున్నాడు అంటూ చాలా మంది అనుకున్నారు. అందుకు కారణం తన మనసులో ఇంకా కావ్య(Kavya Shree) ఉందని, బయటకి వెళ్లిన తర్వాత కచ్చితంగా కావ్య ని కలిసి ప్యాచప్ అయిపొతానని చెప్పుకొచ్చాడు.
Also Read: ‘తండేల్’ 3 వారాల(21 రోజుల) వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోని ప్రాంతాలు ఇవే!
కానీ బయటకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరు కలవలేదు. ఇద్దరు కలిసి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో పాల్గొన్నారు కానీ, ఎడమొహం,పెడమొహం తోనే ఎపిసోడ్ మొత్తం ఉన్నారు. అదే ఎపిసోడ్ లో నిఖిల్ పై పరోక్షంగా సెటైర్లు కూడా వేసింది. జీవితం లో ఇక నుండి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అంటూ చెప్పుకొచ్చింది. నిఖిల్ కి ఇప్పటికీ కావ్యతో ప్యాచప్ అయిపోవాలని ఉంది కానీ, కావ్యకి మాత్రం ఆ ఉద్దేశ్యం లేదు. నిఖిల్ హౌస్ లో ఉన్నప్పుడే అతను ఫేక్ అంటూ సోషలో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఈమె ప్రతీ ఆదివారం సుడిగాలి సుధీర్ హోస్ట్ వ్యవహరించే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం లో పాల్గొన్నది. ఈ ప్రోగ్రాం లో ఈమె నిఖిల్ పై మరోసారి పరోక్షంగా కొన్ని సెటైర్స్ వేసింది. సుధీర్ కావ్య తో మాట్లాడుతూ ‘మీరు ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా’ అని అడుగుతాడు.
అప్పుడు కావ్య దానికి సమాధానం ఇస్తూ ‘నా జీవితం లో ఒక స్నేహితుడిని చాలా గుడ్డిగా నమ్మాను. అలా నమ్మి మోసపోయాను, ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పుకొస్తుంది. ఆమె మాట్లాడుకున్నంతసేపు బాధాకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కావ్య నిఖిల్ పై బహిరంగంగా ఎన్నో సెటైర్లు వేసింది, ఎదో నిఖిల్ పెద్ద మోసగాడు అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసింది, కానీ నిఖిల్ మాత్రం కావ్య గురించి ఇప్పటి వరకు ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఇక్కడే ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కావ్య ని తిడుతూ పోస్టులు కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరిని సమానంగా ఇష్టపడేవాళ్ళు మాత్రం మళ్ళీ కలిసిపోతే బాగుండును అని కోరుకుంటున్నారు.