AP Budget 2025–26: ఆంధ్రప్రదేశ్‌తో 2024 జూలైలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి సర్కార్ తొలిసారి పూర్తి బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న(శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుతవం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలిసారి పూర్తి బడ్జెట్(Budget)ను శుక్రవారం(ఫిబ్రవరి 28న) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొలిసారి రూ.3 లక్షల కోట్లకుపైగా అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేశారు. తాము ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్నవాటికి అధికంగా కేటాయింపులు చేసింది. ఆదాయం, అప్పుల అంశంలోనూ బడ్జెట్‌లో చూపించిన గణాంకాలు చర్చగా మారుతున్నాయి. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు తక్కువగా ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ బడ్జెట్‌తో కూటమి సర్కార్.. విపక్ష నేత జగన్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్లు అయింది.
రాజకీయాస్త్రంగా..
బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యంత ఇచ్చింది. విద్య, వనరులు, పంచాయతీరాజ్(Panchayat raj) శాఖలకు పెద్ద ఎత్తున నిధులుప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా హామీలు అమలు చేయడం లేదన్న విమర్శల వేళ.. సూపర్‌సిక్స్‌లో రెండు ప్రధాన పథకాలకు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పుడు ఈ కేటాయింపులు, కేటాయించని ఇతర హామీలపైన జగన్(Jagan) నిలదీసే అవకాశం ఉంది. సూపర్ సిక్స్‌లోని మూడు ప్రధాన హామీల గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావన కూడా ఏయలేదు. దీంతో ఇది రాజకీయాస్త్రంగా మారబోతోంది.
స్పందిస్తున్న వైసీపీ..
ఇదిలా ఉంటే.. బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తల్లికి వందనం పథకం కోంస రాష్ట్రంలో ఉన్న 81 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి రూ.12 వేల కోట్లు కవాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు బడ్జెట్‌లో కేవలం 9,400 కోట్లు మాత్రమే ప్రతిపాదించడాన్ని ప్పు పట్టారు. ఇక సుఖీభవ కోసం రాష్ట్రంలోని దాదాపు 55 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్లు కావాల్సి ఉండగా, బడ్జెట్‌లో కేవలం రూ.6,300 కోట్లు కేటాయిచండంపై ప్రశ్నించారు. ఈరెండు పథకాలనే బడ్జెట్‌లో ప్రస్తావించి.. వాటికి కూడా పూర్తి నిధులు ఇవ్వలేదు.
ఆ పథకాలేవి..
సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. మహిళలకు ప్రతీనెల రూ.1,500 గురించి ఊసే లేదు. ఉపాధి కల్పించే వరకూ ప్రతీ ఉద్యోగికి నెలకు రూ.3 వేలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయడం లేదని, పథకాలు అమలు కావని జగన్ ఎదురుదాడి మొదలు పెట్టారు. ఈ తరుణంలో బడ్జెట్‌లో పథకాలకు అరకొర కేటాయింపుల నేపథ్యంలో మరోమారు కూటమి సర్కార్‌పై బడ్జెట్ అంశాల ఆధారంగానే ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవతున్న జగన్ బడ్జెట్‌లో కేటాయింపుల అంశాన్ని ప్రజలకు వివరించడం ఖాయం.