TDP MLA Koneti Adimulam : ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు.టిడిపి ఎమ్మెల్యే రాసలీల వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వయంగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె సైతం టిడిపి నేత కావడం విశేషం. దీంతో పార్టీ హై కమాండ్ ఆ ఎమ్మెల్యే పై వేటు వేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ మహిళా నేత సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని వీడియోలతో పాటు ఎమ్మెల్యే పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అదే సమయంలో పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మీడియాకు సైతం ఈ వీడియోలు వెళ్లడంతో వైరల్ గా మారాయి. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు కోనేటి ఆదిమూలం. వైసీపీ టికెట్ నిరాకరించడంతో టిడిపిలోకి ఫిరాయించారు. సత్య వేడు టికెట్ దక్కించుకున్నారు.ఎన్నికల్లో విజయం సాధించారు.ఇప్పుడు ఏకంగా టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించి అడ్డంగా బుక్కయ్యారు.దీంతో ఏపీలో ఇదొక సంచలన అంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అవుతోంది.
* నిన్నటి వరకు వైసిపి నేతలు
గత కొద్దిరోజులుగా వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహార శైలి పై విమర్శలు ఉన్నాయి. ఒక్కొక్కరు పై ఆరోపణలు వచ్చాయి.అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున ప్రచార అంశంగా వాడుకుంది. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే పై అదే తరహా లైంగిక ఆరోపణలు రావడం, బాధితురాలే స్వయంగా ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ మహిళా నేత కావడంతో.. టిడిపి అధిష్టానం వెనువెంటనే చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
* ఆ కారణంతోనే
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు ఎమ్మెల్యే ఆదిమూలం. ఆయన రాకను బాధిత మహిళా నేత వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే హై కమాండ్ ఆయనకు టికెట్ ఇవ్వడంతో బాధితురాలు సహకరించింది. ఆయన గెలుపునకు కృషి చేసింది. అయినా సరే ఎమ్మెల్యే ఆదిమూలం ఆమెపై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. చెల్లెమ్మ అని పిలుస్తూ పలుమార్లు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. తరచూ తన కోరిక తీర్చాలంటూ వేధించే వారిని బాధితురాలు చెబుతోంది. తరచూ ఫోన్ చేస్తూ, మెసేజ్ లు పెడుతూ బెదిరింపులకు దిగారని.. ఆయన వేధింపులు భరించలేక ఆగస్టు 6న, 17న తిరుపతిలోని ఓ హోటల్ రూమ్ కు వెళ్లినట్లు బాధితురాలు చెబుతోంది. తనపై లైంగిక దాడి చేయడంతో భర్తకు ఈ విషయం చెప్పానని… ఆయన అనుమతితోనే మరోసారి ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వీడియోలు చిత్రీకరించినట్లు చెప్పుకొచ్చారు బాధితురాలు. ఎమ్మెల్యే కు బుద్ధి చెప్పాలని రాసలీలలను రికార్డు చేసినట్లు వివరించింది. ఈ ఆధారాలను పరిశీలించి ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును ఆమె కోరినట్లు తెలిసింది.
* టిడిపి హై కమాండ్ కన్నెర్ర
అయితే ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఆదిమూలం చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. సదరు మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. అయితే టిడిపి అధిష్టానం మాత్రం సీరియస్ యాక్షన్ కు దిగినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. మొత్తానికైతే ఎప్పటి వరకు వైసిపి నేతల వ్యక్తిగత వ్యవహార శైలి వివాదాస్పదం అయ్యింది. ఇప్పుడు తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాసలీలలు బయటపడేసరికి సంచలనంగా మారింది.
బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు
హోటల్ గదిలో ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన ఆదిమూలం.. బయటకు వచ్చిన వీడియోలు.
చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు.
ఏపీలో కలకలం రేపుతున్న రాజకీయ నాయకుల అశ్లీల వీడియోలు.… pic.twitter.com/8SHOZ4jAKP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024