Kalki 2898 AD: దాదాపు 7 ఏళ్ల అనంతరం ప్రభాస్ తన స్థాయి విజయం అందుకున్నారు. బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. బాహుబలి 2017లో విడుదలైంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. సాహో కొంతలో కొంత పర్లేదు. కనీసం హిందీ వెర్షన్ విజయం అందుకుంది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. వరల్డ్ వైడ్ కల్కి రూ. 1200 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. ఓవర్సీస్ లో కల్కి విశేష ఆదరణ రాబట్టింది. యూఎస్ లో కల్కి ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. కల్కి మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసిన నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సంస్థలు కల్కి చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చాయి.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కేవలం హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆగస్టు 22 నుండి కల్కి స్ట్రీమ్ అవుతుంది. కాగా కల్కి వరల్డ్ రికార్డు నెలకొల్పినట్లు నెట్ఫ్లిక్స్ తెలియజేసింది. నాన్ ఇంగ్లీష్ విభాగంలో కల్కి హిందీ వెర్షన్ వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. ఇది అరుదైన రికార్డు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కల్కి మూవీలో అమితాబ్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, దిశా పటాని ఇతర కీలక రోల్స్ చేశారు. కల్కి చిత్రానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ఉంది. అసలు కథ కల్కి 2 లో చెబుతానని దర్శకుడు నాగ్ అశ్విన్ అంటున్నారు. భైరవ(ప్రభాస్) సుమతి(దీపికా పదుకొనె)ని అశ్వథామ(అమితాబ్ బచ్చన్) సంరక్షణ నుండి అపహరించుకు పోవడంతో పార్ట్ 1 ముగిసింది. అక్కడి నుండి పార్ట్ 2 మొదలవుతుంది.
మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్రకు పెద్దగా నిడివి లేదు. యాస్మిన్ గా ఆయన ప్రధాన విలన్ రోల్ చేయడం విశేషం. యాస్మిన్ తాను కోరుకున్న దాని కోసం స్వయంగా రంగంలోకి దిగుతాడు. భైరవ, అశ్వద్ధామ కలిసి యాస్మిన్ ని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండను అర్జునుడిగా క్యామియో ఎంట్రీ ఇచ్చాడు. ఇక భైరవ రూపంలో ఉంది కర్ణుడు అని రివీల్ చేశారు. కల్కి 2 థియేటర్స్ లోకి రావడానికి ఇంకా సమయం ఉంది.