Ram Charan: చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆయన తన ఓన్ స్టైల్ ని వాడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేంత వరకే తన నాన్న పేరును వాడుకున్న రామ్ చరణ్…ఆ తర్వాత నుంచి తన సొంత టాలెంట్ తోనే ఎదిగే ప్రయత్నం చేస్తు కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక తనను తాను బిల్డ్ చేసుకున్న విధానం గాని, యాక్టింగ్ లో ఆయన చూపించే మెలకువలు గాని ఆయన పాటిస్తున్న విధానం కానీ ఆయన స్టోరీ సెలక్షన్లలో తీసుకునే జాగ్రత్తలు కానీ ప్రతి ఒక్కటి రామ్ చరణ్ ను ఈరోజు గ్లోబల్ స్టార్ గా నిలబెట్టాయి. ఇక ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఈయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈయన మాత్రం సెలెక్టెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నట్టు కూడా వార్తలయితే వస్తున్నాయి…
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ‘రంగస్థలం ‘ అనే ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే రామ్ చరణ్ లోని నటుడు కూడా పూర్తిస్థాయిలో బయటకు రావడమే కాకుండా చాలా బాగా ఎలివేట్ అయ్యాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ లాంటి నటుడితో సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి తనతో సుకుమార్ మరొక సినిమాని కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందంటూ కేజిఎఫ్ సినిమా వచ్చినప్పటి నుంచి ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత సలార్ 2 సినిమాను కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన రామ్ చరణ్ ని హీరోగా పెట్టి ఒక సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళు చేయబోయే సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా జరిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్ సిద్ధహస్తుడు…
ఆయనలా సినిమాలను చేయడంలో మరే దర్శకుడు కి కూడా అంత నైపుణ్యమైతే లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలో ఒక డార్క్ మూడ్ ను క్రియేట్ చేయడమే కాకుండా అణగారిన వర్గం నుంచి బలవంతుడు బయటకి వస్తే ఎలా ఉంటుందో అలాంటి అంశాలతో ఆయన సినిమా చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి సినిమాకి రామ్ చరణ్ చాలా బాగా సెట్ అవుతాడంటు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…