Homeఆంధ్రప్రదేశ్‌Government Teachers :  ఆంధ్రప్రదేశ్ లో టీచర్లకు "పరీక్ష" పెడుతున్న ప్రభుత్వం

Government Teachers :  ఆంధ్రప్రదేశ్ లో టీచర్లకు “పరీక్ష” పెడుతున్న ప్రభుత్వం

Government Teachers :  ప్రభుత్వ ఉపాధ్యాయుల( government teachers) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి పనితీరును మదించాలని భావిస్తోంది. టీచర్ల పనితీరుకు పాయింట్లు ఇవ్వనుంది. దాని ఆధారంగా పదోన్నతులతో పాటు బదిలీల్లో పెద్దపీట వేయనుంది. సబ్జెక్టుల వారీగా( subject wise) వేరువేరు ప్రామాణికాలను తీసుకోనుంది. పీఈటీలకు స్పోర్ట్స్, సైన్స్ టీచర్లకు ఫెయిర్లు, గణిత ఉపాధ్యాయులకు ఒలింపియాడ్, భాష టీచర్లకు వేరువేరు ప్రాతిపదికలను పరిగణలోకి తీసుకోనుంది. విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించనుంది. పనితీరులో ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉండేలా సరికొత్త ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీ చట్టంపై ( transfer norms ) పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

* బదిలీల సమయంలో గందరగోళం
ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన ప్రతిసారి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటికి చెక్ పెట్టే పనిలో ఉంది పాఠశాల విద్యాశాఖ. బదిలీలతో( transfers ) ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఏటా కచ్చితంగా వేసవిలో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందించే పనిలో ఉంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh)చర్చలు జరిపారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలపై కొంతమేర స్పష్టత తీసుకొచ్చారు. ఈ బదిలీలకు సంబంధించి మరో వారంలో ముసాయిదా బిల్లును తయారుచేసి.. ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో టీచర్ల బదిలీలకు( teacher transfers ) సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకున్నారు. ఏటా కటాఫ్ తేదీని మే 31 గా పరిగణించి.. సర్వీసును లెక్కించే విధంగా బిల్లును రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నారు.

* ఏటా బదిలీలు ఉండేలా..
కొత్త బిల్లును బట్టి.. సార్వత్రిక ఎన్నికలు( general elections ), జనాభా లెక్కలు ఉంటే తప్ప.. ఏటా కచ్చితంగా బదిలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విధానంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల( government teachers) బదిలీలకు షెడ్యూల్ విడుదల చేస్తుండగా.. మరి కొంతమంది టీచర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా షెడ్యూల్ పదేపదే మారిపోతోంది. అదే కొత్త చట్టం అమల్లోకి వస్తే కోర్టు వివాదాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఈ పాయింట్ల విధానం, కొత్త చట్టం తీసుకురావడం పై ఉపాధ్యాయుల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియాలి. అందుకే ఈ బిల్లు అంశంపై ఈ నెల 17న ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular