Homeఆంధ్రప్రదేశ్‌Mango : ఆ మామిడి ధర అక్షరాల పదివేలు.. ఎందుకంటే?

Mango : ఆ మామిడి ధర అక్షరాల పదివేలు.. ఎందుకంటే?

Mango :  ఆ మామిడిపండు( mango fruit) ధర అక్షరాల 10 లక్షల రూపాయలు. మీరు చదివింది నిజమే. మామిడిపండు ఏంటి.. పది లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అంటే అది నిజమే ఏలూరు జిల్లా నూజివీడు లోని నాగేంద్ర వరలక్ష్మి కళ్యాణమండపంలో మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్ షాప్ నిర్వహించారు. అక్కడ ఎంతో ప్రాశస్త్యం కలిగిన మియాజాకి మామిడి పండ్లను కూడా ఉద్యానవన శాఖ అధికారులు ప్రదర్శనకు ఉంచారు. ఈ మియాజాకి మామిడిపండును అత్యధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుసుకొని మంత్రి పార్థసారథి, అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఒక్కో మామిడిపండు ధర పదివేల రూపాయలు పలుకుతుందని చెప్పడంతో దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.

Also Read : ఆ మామిడి ధర అక్షరాల పదివేలు.. ఎందుకంటే?

* అరుదైన జాతి
ఇదో అరుదైన మామిడిగా తెలుస్తోంది. చాలా రకాలుగా ఔషధ లక్షణాలు ఉంటాయి. ఇటీవల కాలంలో నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో ఏపీ రైతులు( AP formers ) ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతాంగ సంక్షేమానికి కూడా సబ్సిడీతో కూడిన పథకాలను అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు సంబంధించి చాలా రకాల పథకాలు నిలిచిపోయాయి. వాటికి ప్రోత్సాహం అందించాలన్న క్రమంలో ఈ ప్రత్యేక మేలను నిర్వహించారు. అందులో భాగంగానే మియాజాకి రకం మామిడిని సైతం ప్రదర్శనలో ఉంచారు.

* జపాన్ లో సాగు
ఈ రకం మామిడి పండ్లు ఎక్కువగా జపాన్ లో( Japan) ఉంటాయి. సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ మామిడి పళ్ళు కాస్తాయి. మియాజాకి ప్రాంతం సమ శీతోష్ణ ప్రాంత పరిధిలో ఉంటుంది. ఇక్కడ తగినంత సూర్యరశ్మి, గాలిలో తేమ, అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి వచ్చిన పదార్థాల తో ఏర్పడిన సారవంతమైన నేలలు ఈ మామిడి పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా అరుదైన రుచులు, రంగులతో కూడా కనిపిస్తుంది.

* మనదేశంలో సైతం..
అయితే వీటి ఉత్పత్తిలో వింత పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక్కో మామిడిపండును చేతితో సంపర్కం చేయిస్తారు. మామిడి పెరిగినప్పుడు కూడా ఆకారం సరిగ్గా వచ్చేలా చూసేందుకు సంచులు, అట్ట పెట్టెలు లాంటివి కడుతుంటారు. అద్భుతమైన రుచి, అందమైన ఆకారం, తక్కువగా అందుబాటులో ఉండడంతోనే ఈ పండ్లకు అంత ధర వస్తుంటుంది. అయితే ఈ రకం మామిడి సాగు మనదేశంలో కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో బీర్ బూమ్ జిల్లాలో రైతుల సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జబల్పూర్ కు చెందిన రైతు సైతం వీటి సాగుకు ప్రయత్నించారు. ఈ పండ్లలో ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే దీని ధర అమాంతం పదివేల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : ఈ మామిడికాయలను అంబానీ, అదాని మాత్రమే కొనగలరు.. ఎందుకంటే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular