Nag Ashwin : ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు. నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు కల్కి 2 సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి కసరత్తులైతే చేస్తున్నాడు… ఇక ఆయన ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రభాస్ (Prabhas) తో చేసిన ‘కల్కి’ సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకున్న ఆయన 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన సినిమాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే నాగ్ అశ్విన్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వచ్చింది. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోయే సినిమాను సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ చేసే విధంగా ఉండబోతున్నాయి అంటూ తన అభిమానులు చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు…
Also Read : ‘కల్కి’ పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని నాకు తెలుసు – నాగ అశ్విన్
ఇక ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంటుంది. నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో ఒకరికి ఒకరు పోటీగా నిలుస్తున్నారు. ఎవరి సినిమాలను వాళ్ళు సక్సెస్ తీరాలకు చేరుస్తున్నప్పటికి అప్పటికి వీళ్ళ మధ్య పోటీ అయితే నడుస్తుందనేది వాస్తవం. ఇక ఈ ఇద్దరు హీరోలకు నాగ్ అశ్విన్ చాలా క్లోజ్ ఫ్రెండ్…
అందుకే వీళ్లిద్దరిని పెట్టి ఆయన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాని చేశాడు. అయితే ఆ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అయింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు హీరోలను కలిపిన ఆయన మరోసారి వీళ్ళిద్దరితో మల్టీసారర్ సినిమాని చేసే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి పెద్ద హీరోల మధ్య ఇలాంటి పోటీ అయితే ఉంటుందో ఈ యంగ్ హీరోల మధ్య కూడా అలాంటి పోటీనే కొనసాగుతుంది.
మరి వీళ్ళిద్దరిలో ఎవరు స్టార్ హీరోగా మారతారు? ఎవరు మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోతారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వీళ్లిద్దరికి మంచి టాలెంట్ అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. మరి ఈ సినిమాతో నాని తన కెరియర్ లో భారీ విజయాన్ని సాధిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్…ఇక రచ్చ రచ్చే…