Prithviraj : అమ్మ బత్తాయో..పోసాని ప్లేసులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి!

ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభమైంది. మూడు పార్టీల నేతలకు పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పోస్టులను ప్రకటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : August 21, 2024 12:54 pm

Prithviraj

Follow us on

Prithviraj  : టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. మండలాధీశుడు అనే సినిమాతో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యారు. దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు పనిచేశారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఏపీలో కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. నిజంగా అదే జరగడంతో పృధ్విరాజ్ పంట పండింది. ఆయనకు కీలక పదవి దక్కుతుందన్న ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి చేపట్టిన పదవి.. పృధ్విరాజ్ కు వరించనుందని టాక్ మొదలైంది. 2014 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు పృథ్వీరాజ్. అప్పటినుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తూ ఉండేవారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి గట్టి వాయిస్ వినిపించడంలో ముందుండేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో పృథ్విరాజ్ కు మరింత గుర్తింపు లభించింది. ఏకంగా టీటీడీ భక్తి ఛానల్ కు చైర్మన్ గా నియమితులయ్యారు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు అదే పదవిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించేవారు. అటువంటి అరుదైన చాన్స్ ను దక్కించుకున్నారు పృథ్వీరాజ్. అయితే అప్పట్లో ఓ మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బయటపడింది. దీంతో జగన్ ఆదేశాల మేరకు ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

* వైసీపీ నేతల కుట్రతో?
అయితే అప్పట్లో వైసీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు పృథ్వీరాజ్. కానీ జగన్ పట్టించుకోలేదు.దీంతో ఆ పార్టీకి దూరమయ్యారు.వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. క్రమేపి టిడిపి, జనసేన లకు దగ్గరయ్యారు. అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు పృథ్వీరాజ్. అలా చేసినందుకు బహిరంగంగానే క్షమాపణలు అడిగారు. జనసేనకు మద్దతుగా నిలిచారు. చివరకు పవన్ పృధ్విరాజును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కుమార్ మద్దతుగా ప్రచారంలో దూసుకుపోయారు పృథ్వీరాజ్.

* జనసేన తరుపున
అయితే ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభమైంది. జనసేన తరఫున నామినేటెడ్ పోస్టు పృథ్వీరాజ్ కు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పృథ్విరాజ్ కు వరించినట్లు సమాచారం. తొలుత ఈ పదవి నాగబాబుకు అంటూ ప్రచారం సాగింది. కానీ నాగబాబు అంతకంటే పెద్ద పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జనసేన తరఫున ఇప్పటికే పృధ్విరాజ్ పేరును సీఎం చంద్రబాబు కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

* పోసానిపై రీమార్క్ అదే
గత ఐదేళ్లలో ఈ పదవి పోసాని కృష్ణమురళి నిర్వర్తించారు. సినీ రంగ సమస్యల కంటే రాజకీయ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు పోసాని. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి కుటుంబం పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా అభిమానులు రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ ఓడిపోవడంతో పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పెద్దగా మాట్లాడడం లేదు. ఆ పదవికి పృధ్విరాజ్ కరెక్ట్ అని.. ముక్కు సూటితనంతో వ్యవహరిస్తారని ఆయన పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జనసేన కోసం అహర్నిశలు శ్రమించిన పృథ్వీరాజ్ కు మంచి పదవితో సముచిత స్థానం కల్పిస్తున్నారన్నమాట.