AP Elections 2024: ఏపీ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆలోచన తప్పింది. ఎలక్షన్స్ ముందు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఈసీ కొందరిపైనే బదిలీ వేటు వేసింది. మిగతా వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించింది. ఇప్పుడు ఎన్నికల్లో హింస చెలరేగడంతో ఈసీకి తత్వం బోధపడింది. ఏపీలో అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. వరుసగా అధికారులపై వేటు వేస్తోంది. పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీ పై బదిలీ వేటుతో పాటు శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
అల్లర్లు చెలరేగిన మూడు జిల్లాల్లో 12 మంది ఇతర పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘర్షణలకు సంబంధించి అన్ని కేసులపై సిట్ ఏర్పాటై.. రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన అదనపు సెక్షన్లను జతపరచాలని కూడా స్పష్టం చేసింది. కౌంటింగ్ తర్వాత కూడా హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జూన్ 15 వరకు 25 కంపెనీల కేంద్ర మిలిటరీ బలగాలను ఏపీలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలని ఆదేశించింది.
ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలని ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ కోరింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చినప్పుడే.. సి ఎస్ ను మార్చాలని పట్టు పట్టింది. కానీ ఈసీ మాత్రం డీజీపీని మాత్రమే మార్చి చేతులు దులుపుకుంది. ఇప్పుడు హింస ఎలా రేగడంతో అది తప్పు అని తేలింది. డిజిపిని మార్చినప్పుడే సి ఎస్ ను మార్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హింస చలరేకడంతో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పైన ఈసీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పైన వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. బీసీ తాజా చర్యలతో అధికార వర్గాల్లో కలకలం రేగుతోంది. మున్ముందు ఎంతమంది అధికారులపై వేటు పడనుందోనన్న చర్చ నడుస్తోంది.