https://oktelugu.com/

America: ఒక ప్రమాదం నుంచి బయట పడగానే మరో ప్రమాదం.. అమెరికాలో తెలుగోడిని వెంటాడిన మృత్యువు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇతడి తండ్రి పేరు వెంకటరమణ. ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందాడు. జహీరాబాద్ నుంచి కుటుంబాన్ని ఎల్బీనగర్ లోని అల్కాపురి ప్రాంతానికి మార్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 17, 2024 / 10:13 AM IST
    America

    America

    Follow us on

    America: రెండు సంవత్సరాల క్రితం ఆ ఇంటి పెద్ద కన్నుమూశాడు. ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి ఆ కుటుంబం కోలుకోలేదు. కానీ ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడగానే.. మరో ప్రమాదం రూపంలో ఆ కుటుంబంలో ఇంకో మరణం సంభవించింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఈ సంఘటన అమెరికాలో బుధవారం జరిగింది..

    సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇతడి తండ్రి పేరు వెంకటరమణ. ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందాడు. జహీరాబాద్ నుంచి కుటుంబాన్ని ఎల్బీనగర్ లోని అల్కాపురి ప్రాంతానికి మార్చాడు. అక్కడే ఒక ఇల్లు కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం వెంకటరమణ అనారోగ్యంతో కన్నుమూశాడు. వెంకటరమణ మృతి నేపథ్యంలో ఇప్పటికీ ఆ కుటుంబం ఆ దుఃఖం నుంచి కోలుకోలేదు. ఇక వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఏడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు.. అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీ ప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

    పృథ్వీరాజ్, శ్రీ ప్రియ నార్త్ కరోలినా ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. బుధవారం పృథ్వీరాజ్ తన భార్యతో కలిసి కారులో పనిమీద బయటికి వెళ్లి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ వర్షం కురుస్తోంది. దీంతో కారు వేగాన్ని నియంత్రించలేక మరో వాహనాన్ని ఢీకొట్టాడు.. సమయంలో పృథ్వీరాజ్ నడుపుతున్న కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సురక్షితంగా భార్యతో కలిసి బయటపడ్డాడు. భార్యను కారులోనే కూర్చోబెట్టి.. పృధ్విరాజ్ బయటికి వెళ్లి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా.. అదేదారిలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. కళ్ళముందే భర్త చనిపోవడంతో శ్రీ ప్రియ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వీరాజ్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదం పృథ్వీరాజ్ జీవితాన్ని నాశనం చేసిందని అతని స్నేహితులు వాపోతున్నారు. పృథ్వీరాజ్ మృతితో అతని భార్య శ్రీ ప్రియ కంటికి ధారగా విలపిస్తోంది.