https://oktelugu.com/

YS Jagan Mohan Reddy : పాప ఎపిసోడ్.. ఫాఫం జగన్ అడ్డంగా బుక్కయ్యారా? నిజాలు ఇవీ

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి వద్ద గుక్క పెట్టి ఏడ్చిన ఓ బాలిక ఎపిసోడ్ వెనుక ఐప్యాక్ టీం ఉందని తేలిపోయింది.

Written By: , Updated On : February 20, 2025 / 01:29 PM IST
YS Jagan

YS Jagan

Follow us on

YS Jagan Mohan Reddy  : ఏదైనా చేస్తే నమ్మేలా చేయాలి. అబద్ధం ఆడినా అద్దంలో ఉండాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. రాజకీయాల్లో రకరకాల జమ్మిక్కులు చేసే వ్యూహకర్తల బృందాలు వచ్చాయి. ఆపై సోషల్ మీడియా( social media) విభాగాలు చాలా రకాల కసరత్తులు చేస్తాయి. అయితే ఇప్పుడు అవి చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. నిన్నటి కి నిన్న విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో జైలు బయట జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి పై ఓ బాలిక పెంచుకున్న పిచ్చి ప్రేమ బయటపడింది. అయితే దీని వెనుక ఐపాక్ టీం ఉందని తేలిపోయింది.

* ఐ ప్యాక్ టీమును నమ్మిన జగన్
జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) తనకంటే.. ఎక్కువగా నమ్మింది ఐప్యాక్ టీంనే. వాళ్లు నిలబడమంటే నిలబడతారు. కూర్చోమంటే కూర్చుంటారు. అంతలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పై ఐప్యాక్ టీం ప్రభావం. 2019లో తన విజయానికి ఐ ప్యాక్ టీం కారణమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. అయితే 2024లో ఓటమికి కూడా అదే ఐప్యాక్ కారణమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. ఇంకా వారినే నమ్ముకుంటున్నారు. దీంతో పాత చింతకాయ పచ్చడి మాదిరిగా వారు ఏవేవో స్కీములు వేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ సబ్ జైలు వద్ద జరిగిన చిన్నారి యాక్షన్ అంటూ ప్రచారం నడుస్తోంది.

* విజయవాడ రోడ్డు షోలో..
విజయవాడ రోడ్ షోలో ( road show) ఓ చిన్నారి ఏడుస్తూ జగన్ వద్దకు చేరుతుంది. తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకుని దగ్గరకు తీసుకెళ్లాడు. వ్యక్తి వ్యక్తి కుక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నారు. ఆ పాప వెంటనే సెల్ఫీ తీసుకుని ఆనందించింది. అయితే అక్కడితో ఆ ఎపిసోడ్ ముగియలేదు. చదువుకున్న ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే ఫక్కున నవ్వు తెప్పించే అంశం. మొత్తం ఇది ఒక డ్రామాను తలపించింది. ఐ ప్యాక్ నాటకంగా భావించిన టిడిపి సోషల్ మీడియా వెతికి వెతికి మరి పట్టుకుంది. తెర వెనుక ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది.

* ఇదో ఫన్ ఎపిసోడ్ లా
అయితే అలా ఏడ్చిన చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని.. ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని.. తల్లి కూడా ప్రైవేటు ఉద్యోగి అని.. పాప చదివేది రవీంద్ర భారతి స్కూలులో అని తేలిపోయింది. అంటే అది ఉన్నతమైన కుటుంబమే కదా. దీంతో ఈ టోటల్ వ్యవహారం ఒక ఫన్ ఎపిసోడ్ గా మిగిలిపోయింది. ఐప్యాక్ చేసిన నాటకాలుగా తేలిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇదో ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈసారి నిజంగా జరిగిన ఘటనలను బయటపెట్టినా.. అదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని భావించేలా పరిస్థితికి వచ్చింది.