Mega Dsc : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అప్పుడే.. సిలబస్ పై క్లారిటీ!

తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఫైల్ పై సంతకం చేశారు.ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు.ఇందుకు ముహూర్తం నిర్ణయించారు.

Written By: Dharma, Updated On : October 9, 2024 5:45 pm

Mega Dsc Notification

Follow us on

Mega Dsc : ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. అందులో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ బైక్ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఫైల్ పై సంతకం చేశారు. వైసిపి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6000 పోస్టులకు కాకుండా.. దానికి మరో 10 వేల పోస్టులను కలిపి 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ ఇంతవరకు జారీ కాలేదు. అయితే ఇప్పుడు ఆ మెగా డీఎస్సీ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా సిలబస్ పై కూడా స్పష్టత ఇచ్చింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ను నవంబరు 3న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం.అంతకుముందు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఫలితాలను నవంబర్ 2న ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. టెట్ ఫలితాలు విడుదల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం టేట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వెనువెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

* డిసెంబర్ 31లోగా ప్రక్రియ
ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీప్రక్రియ పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం. కాగా డీఎస్సీ సిలబస్ లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్ను కొనసాగించడానికి నిర్ణయించింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. దానికి 10,200 పోస్టులు జతచేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.