Deputy CM Pavan Kalyan : టీటీడీ లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించింది. జాతీయ మీడియాలో సైతం ఆయన హైలెట్ గా నిలిచారు. తిరుమల లడ్డుకు సంబంధించి.. వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్నది చంద్రబాబు ప్రధానంగా చేసిన ఆరోపణ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఈ సంచలన విషయాన్ని బయట పెట్టారు చంద్రబాబు. అప్పటినుంచి దానిని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. గట్టిగానే తన వాయిస్ వినిపించారు. ఏకంగా పాప ప్రక్షాళన కోసం ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. 11 రోజులపాటు దీక్ష చేపట్టారు. అందులో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయమెట్లను కూడా శుభ్రం చేశారు. అటు తరువాత తిరుమలకు కాలినడకన వెళ్లారు. సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. వారాహి సభలో కీలక ప్రసంగం కూడా చేశారు. ఇవన్నీ జాతీయస్థాయిలో లడ్డు వివాదాన్ని హైలెట్ చేశాయి. అదే సమయంలో పవన్ సైతం హైలెట్ గా నిలిచారు. తిరుమలలో కల్తీ జరిగిందనడానికి ఏమాత్రం ఆధారాలు లేవంటూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పష్టం చేసింది. అయినా సరే పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వారాహి బహిరంగ సభలో పరోక్షంగానే విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని.. ధర్మాన్ని వ్యతిరేకించే వారికి న్యాయస్థానాలు రక్షణ సైతం కల్పిస్తున్నాయని వ్యాఖ్యానించడం.. తెలియజేశాయి.
* హిందూ సమాజంలోకి బలంగా
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. దీనిపై డిక్లరేషన్ చేశారు. ఇది దేశంలోని హిందూ సమాజంలోకి బలంగా వెళ్లాయి. ఈ పరిణామాలన్నీ పవన్ ను జాతీయస్థాయిలో నిలబెట్టాయి. తిరుమల లడ్డు వివాదం కొనసాగినన్ని రోజులు ఆయన పేరు జాతీయ మీడియాలో ప్రస్తావనకు వచ్చేది. దీనిని బట్టి తిరుమల లడ్డు విషయంలో పవన్ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్ళారా? అన్న అనుమానాలు కూడా కలగక మానవు.
* హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా
వాస్తవానికి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. దానిని రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకున్నారు. కానీ ఆ పార్టీకి ఈ విషయంలో సరైన గుర్తింపు దక్కలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పని చేసి చూపించారు. మరోవైపు బలమైన మిత్రుడిగా బిజెపికి పవన్ మారిపోయారు ఈ పరిణామాలతో. తాము ఇంతవరకు అనుసరిస్తున్న హిందుత్వ విధానానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ పవన్ రూపంలో దొరికాడని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ సనాతన నినాదాన్ని అందుకున్న తర్వాత రాజకీయంగా ఆయనకు మైలేజ్ పెరిగిందని నిర్ణయానికి బిజెపి కేంద్ర నాయకత్వం వచ్చింది. అదే సమయంలో పవన్ ను బిజెపిలో చేర్చుకునేందుకు జనసేనను ఆ పార్టీ ఆశ్రయించిందని కూడా నేషనల్ మీడియా కథనం రాసింది. అయితేపవన్ లో ఆ ఫైర్ చూసి.. బిజెపి పెద్దలు సైతం ఫిదా అయినట్లు తెలుస్తోంది.