https://oktelugu.com/

Scorpio : పుట్టెడు కష్టాలు తప్పవు.. ఈ రాశివారికి ఏడు నెలల పాటు శని ప్రభావం.. ఏం చేయాలంటే?

శని సంచారం వల్ల కొందరి జీవితాలు అనేక మలుపులు తిరుగుతాయి. ఒక వ్యక్తి జన్మరాశిలో నాలుగవ రాశిలో శని సంచారం ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. అంటే ప్రస్తుతం వృశ్చిక రాశి వారి జాతకంలో శని సంచారం చేయనున్నాడు. దీంతో వీరు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి సంవత్సరం పాటు ఉంటుంది. అయితే ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 14, 2024 / 10:57 AM IST

    Scorpio

    Follow us on

    Scorpio : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆ రాశి గల జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ కొందరి జీవితాల్లో ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. అందుకు కారణం గ్రహాల మార్పేనని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణలు చెబుతుంటారు. అయితే ఈ గ్రహాల మార్పుపై అవగాహన ఉండి.. ముందే తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి గట్టెక్కేయవచ్చు. కొన్ని పరిహారాల వల్ల భారీ నష్టం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ప్రతీ ఒక్కరి జీవితంలో శని సంచారం ఉంటుంది. శనీశ్వరుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు. అలా అన్ని రాశుల సంచారం పూర్తయ్యే సరికి 30 సంవత్సాలు పడుతుంది. శని సంచారం కారణంగానే కొన్ని రాశులపై ప్రభావం పడి వారి జీవితాల్లో కొన్ని కలకలాల ఉంటాయి. ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉన్నాడు. ఈ రాశిలో సంచారం కారణంగా వృశ్చిక రాశిపై ప్రభావం పడుతుంది. అంటే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కొనసాగుతుంది. అసలు అర్ధాష్టమ శని అంటే ఏమిటి? వీరి జీవితంలో శని ఎంతకాలం ఉంటాడు?

    శని సంచారం వల్ల కొందరి జీవితాలు అనేక మలుపులు తిరుగుతాయి. ఒక వ్యక్తి జన్మరాశిలో నాలుగవ రాశిలో శని సంచారం ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. అంటే ప్రస్తుతం వృశ్చిక రాశి వారి జాతకంలో శని సంచారం చేయనున్నాడు. దీంతో వీరు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి సంవత్సరం పాటు ఉంటుంది. అయితే ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. మరో ఏడు నెలల పాటు వీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏడు నెలల తరువాత అర్దాష్టమ శని మీన రాశిలోకి వెళ్తుంది. దీంతో వృశ్చిక రాశి వారికి విముక్తి కలుగుతుంది.

    అర్ధాష్టమ శని కారణంగా వృశ్చిక రాశి వారు ఊహించని చిక్కులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి ప్రతికూల వాతావరణం ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారు కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కోపానికి దూరంగా ఉండాలి. వివాదాల జోలికి పోవద్దు. ఉద్యోగులు సీనియర్లలతో సత్సంబంధాలు మెయింటేన్ చేయాలి. వ్యాపారులకు లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే భూములు, ఆస్తులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అనువైన సమయమేనని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. కానీ రుణాల జోలికి వెళ్లకుండా ఉండాలి.

    వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని కారణంగా ఎదుర్కొంటున్న చిక్కుల నుంచి బయటపడాలంటే ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ప్రతీరోజూ హనుమాన్ చాలీసాను చదువుతూ ఉండాలి. వీలైతే శివ చాలీసాను పఠించాలి. చంద్ర బీజ మంత్రాన్ని జపించడం వల్ల శని దేవుడు ప్రసన్నమవుతాడు. అంతేకాకుండా కొన్ని ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. అందువల్ల ఈ 7 నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే మంచి ఫలితాలతో బయటపడొచ్చు.