https://oktelugu.com/

Kannappa: కన్నప్ప కోసం రంగంలోకి దిగుతున్న రజినీ కాంత్… కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ అనేది అంత తేలికగా రాదు. దాని కోసం చాలా తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది...ఇక ఇప్పుడు సక్సెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కప్పుడు చాలా కష్టపడిన వాళ్ళే...

Written By:
  • Gopi
  • , Updated On : August 14, 2024 / 10:58 AM IST

    Kannappa

    Follow us on

    Kannappa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో మోహన్ బాబు ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన విలన్ పాత్రలను చేసి సరికొత్త విలన్ గా అవతరించాడు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సైతం విలన్ గా నటించి మెప్పించడం ఒక మోహన్ బాబు కే చెల్లింది. ఇక ఆ తర్వాత హీరోగా కూడా రాణించి పలు వైవిద్య భరితమైన సినిమాలను చేసి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మోహన్ బాబు పేరు చెబితేనే అందరూ నవ్వుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే మోహన్ బాబు మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ దానికి కారణమని చెప్పాలి. నిజానికి ఒకప్పుడైతే మోహన్ బాబు ఒక పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్ర యొక్క గొప్పతనం అనేది చాలా బాగా ఎలివేట్ అయ్యేది. కానీ ఈ రోజుల్లో ఆయన స్టేజ్ ఎక్కితే చాలు తన డబ్బా తానే కొట్టుకోవడం వల్ల ఆయన అందరిలో చులకనగా మారిపోయాడు… ఇక మోహన్ బాబు పరిస్థితి ఇలా ఉంటే తన పెద్ద కొడుకు అయిన మంచు విష్ణు పరిస్థితి మరోలా ఉంది.

    ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కటికి కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన హీరోగా సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో విష్ణు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ద్వారా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే విష్ణు ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నానని చెప్పి ఏదో చిన్న చిన్న లొకేషన్స్ లో సినిమాను చుట్టేస్తున్నాడు. కానీ సినిమాకి మాత్రం 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నాను అని చాలా గొప్పగా చెబుతున్నాడు. జెన్యూన్ గా 150 కోట్ల బడ్జెట్ పెడితే అవుట్ పుట్ అనేది అలా రాదు. ఇంకా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీగా వస్తుందనే ఉద్దేశంతోనే మీమర్స్ ఈ సినిమా మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు…

    ఇక ఈ సినిమా తేడా కొట్టేలా ఉంది అని అనుకుంటున్న విష్ణు రజినీకాంత్ ను సంప్రదించినట్లు గా తెలుస్తుంది. ఇక దాంతో ఈ సినిమాని అలాగే విష్ణుని ఎలాగైనా సరే కాపాడాలనే ఉద్దేశ్యం తోనే రజినీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేపట్టడానికి ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆయన ఈ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి..చూడాలి మరి రజినీకాంత్ అయిన కన్నప్ప సినిమాను కాపాడుతాడా లేదా అనేది..