The Economic Times: గొప్ప వ్యక్తులను కొందరు వ్యతిరేకిస్తుంటారు. వారు ఎంత స్థాయికి ఎదిగినా.. సమాజం గుర్తించినా తట్టుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అలానే ఉంది. ఆయనతో రాజకీయపరమైన విభేదాలు ఉండవచ్చు కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పాలనా సంస్కరణలు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చూపే చొరవ, త్వరితగతిన అనుమతులు, ఒప్పందాలు ప్రత్యేకమే. అయితే దానిని చాలామంది గుర్తించరు. జగన్ తో పాటు కేసీఆర్ అసలు ఆహ్వానించరు. ఏదో వంక పెడుతూనే ఉంటారు. అయితే చిన్నచిన్న లోపాలు అన్నవి సహజం. వాటిని భూతద్దంలో పెట్టి చూడలేము కూడా. అయితే చంద్రబాబును వ్యతిరేకిస్తున్న వారికి కనిపించని అభివృద్ధి, పాలనా దక్షత… టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక గుర్తించింది. అదేం అల్లాటప్ప పత్రిక కాదు.. వాస్తవాలు గ్రహించి గుర్తించి ఆ అవార్డు ఏటా ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ ఎడిషన్ లో చంద్రబాబు ప్రతిభను గుర్తించింది ఆ పత్రిక.
వాటి జాడ లేకపోవడంతో..
జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమం నడిచింది. దానిని ఎవరూ కాదనలేరు కూడా. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. అంతవరకు ఓకే. కానీ పెట్టుబడుల జాడలేదు. పరిశ్రమల ఊసు లేదు. కొత్త పరిశ్రమల రాకలేదు. ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. దీంతో ఏపీ అంటే చూసేవారు కరువయ్యారు. కానీ చంద్రబాబు అలా కాదు. భారీగా పెట్టుబడులను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం ఇవ్వాలో కూడా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. అప్పటివరకు ఉన్న అయోమయాన్ని తొలగించి సహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడంతా పరిస్థితి ఒక స్థిరత్వానికి వచ్చింది. అందుకే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. కానీ ఇప్పటికీ జగన్ ఆ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రైవేటు పరం అంటూ గోల చేస్తున్నారు. ఆయన బాధ ఆయనది అన్నట్టు ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలని తెగ ఆరాటపడుతున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో గుర్తించింది ఎకనమిక్ టైమ్స్.
అంతర్జాతీయ పత్రిక గుర్తించింది..
రాజకీయ పార్టీల నేతలకు ఎంతవరకు రాజకీయమే కావాలి. కానీ కొన్ని వ్యవస్థలకు అలా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి చేయని అభివృద్ధి, ముందుచూపు చంద్రబాబు చేశారని గుర్తించింది అంతర్జాతీయ పత్రిక. అదేం చంద్రబాబు అనుకూల మీడియా పత్రిక కాదు. ఆయన సామాజిక వర్గానికి చెందినది కాదు. ఆయన మనుషులు మేనేజ్ చేసే స్థాయిలో లేదు ఆ పత్రిక. ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు, ఆర్థిక రంగానికి దిక్సూచి ఆ పత్రిక. అందుకే ఆ పత్రిక పై అవాకులు చవాకులు పేలడానికి వీలులేదు. సరిగ్గా ప్రైవేటు పరం అంటూ జగన్ గవర్నర్ దగ్గరకు వెళ్లి గగ్గోలు చేసే సమయంలో ఎకనామిక్ టైమ్స్ పిడుగు లాంటి వార్తను జగన్మోహన్ రెడ్డికి చెప్పింది. అయితే ఈ అవార్డు చంద్రబాబు కంటే జగన్ కే ఎక్కువ అవసరం. ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు.. ఇలాంటి రాజకీయాన్ని పక్కన పెడితే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను గుర్తు చేసింది ఎకనామిక్ టైమ్స్.
ప్రతిపక్ష హోదా కోసం..
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అరచి గోల పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). కానీ అంతకంటే ముందే ఆయన బలమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయంతో వ్యవహరించారు. అటువంటి సమయంలో ఇటువంటి గుర్తింపు ఎప్పుడైనా వచ్చిందా? పోనీ దాన్ని వదిలేద్దాం. పదేళ్లపాటు సుదీర్ఘ రాజకీయం చేశారు. ఏది మంచి? ఏది చెడ్డ అన్నది ఆలోచన చేయకపోతే ఎలా? ఇకనైనా అనవసర రాద్దాంతం మానుకొని నిజమైన ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడి పోరాటం చేస్తే ఆయనకు ప్రజల్లో గుర్తింపు రావడం ఖాయం.