Delhi Metro Viral Video: నేటి కాలంలో యువత మంచి స్పీడ్ మీద ఉన్నారు.. చదువుల నిమిత్తం.. ఉద్యోగాల నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు.. కట్టలు తెంచుకునే స్వేచ్ఛ.. వయసు వేడి.. ఫలితంగా యువత రెచ్చిపోతుంది.. పెళ్లయిన తర్వాత.. నాలుగు గోడల మధ్య జీవిత భాగస్వామితో చేయాల్సిన పనులను నాలుగు దిక్కుల మధ్య చేస్తోంది.. అది కూడా పెళ్లి కాకముందే..
ఢిల్లీ మెట్రోలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఢిల్లీ మెట్రోలో జరిగే రాసలీలలు ఒక్కొక్కటిగా కనిపిస్తూనే ఉంటాయి..ఆ మధ్య కొంతమంది ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ మెట్రో అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించారు. యువతీ యువకులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేశారు. కానీ అది తాత్కాలికం మాత్రమే.. కట్టలు తెచ్చుకునే యువత కామం ముందు ఢిల్లీ మెట్రో అధికారుల కట్టుబాట్లు పెద్దగా పని చేయలేదు.. అందువల్లే ఢిల్లీ మెట్రోలో అక్కడి యువత మరోసారి తమ కామకేళి మొదలుపెట్టారు.
తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు మామూలుగా లేవు.. ఢిల్లీలో మెట్రో పరుగులు తీస్తుండగా కిటికీ పక్కన ఇద్దరు యువతీ యువకులు నిలబడ్డారు. టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్ల మాదిరిగా పోజు పెట్టారు. చుట్టుపక్కల జనం ఉన్నారని.. తాము మెట్రోలో ప్రయాణం చేస్తున్నామని విషయాన్ని మర్చిపోయి.. ఒకరినొకరు కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటేశారు. చుట్టుపక్కల ఉన్నవారు ఇదేం దరిద్రం రా బాబు అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.
వాస్తవానికి మెట్రోలో సీసీ కెమెరాలు ఉంటాయి.. ప్రయాణికుల ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాయి.. అలాంటప్పుడు మెట్రోలో ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? సీసీ కెమెరాలు పనిచేయడం లేదా? లేకపోతే యువత చేస్తున్న కామకేళి ని ఖర్చు లేకుండా చూద్దామనుకుంటున్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి ఢిల్లీ మెట్రో అధికారులు ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.
Delhi Metro is the New Oyo Room #FI pic.twitter.com/yYezfhwpvK
— Fundamental Investor ™ (@FI_InvestIndia) December 17, 2025