IAS and IPS Transfers
IAS and IPS Transfers : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. పాలన వ్యవస్థలో ప్రక్షాళనకు దిగింది. అందులో భాగంగా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ఐఏఎస్ లకు పోస్టింగులు, బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత కీలకమైన సీఆర్డీఏ కమిషనర్ గా కన్నబాబు నియమితులయ్యారు. సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాగా హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్ నియమితులయ్యారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మొన్నటికి మొన్న ఏపీ సీఎస్ గా విజయానంద్ నియమితులైన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు మిగతా విభాగాలకు సంబంధించి అధికారుల నియామకం చేపడుతున్నారు.
* వివిధ విభాగాలకు ఇలా
పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బీ. రాజశేఖర్( Rajasekhar ), ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు . పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ నియమితులయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సౌరబ్ గౌర్, సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ ను నియమించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా వీర పాండ్యన్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజిగా హరినారాయణ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోగా పట్టణ్ శెట్టి రవి సుభాష్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్గా సంపత్ కుమార్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా అభిషేక్ నియమితులయ్యారు.
* ఐఏఎస్ లకు పదోన్నతులు
మరోవైపు ఆర్కియాలజీ( archaeology ), మ్యూజియంలో శాఖా కమిషనర్ గా వాణిమోహన్, కార్మిక శాఖ కమిషనర్ గా ఎం.వి శేషగిరి బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శిగా కాటమనేని భాస్కర్, ఉన్నత విద్య కార్యదర్శిగా కోన శశిధర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకో వైపు 27 మంది ఐపీఎస్ అధికారులను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. చాలామందికి పోస్టింగులు సైతం ఇచ్చింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు కూడా.
* రాజీవ్ కుమార్ మీనాకు కీలక బాధ్యతలు
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్( AP Police Recruitment Board) చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా నియమితులయ్యారు. శాంతి భద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి, ఆపరేషన్ ఐజీగా సిహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజిపి గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజిపిగా రాజకుమారి, ఏపీ ఫోరెనిక్స్ ల్యాబ్ డైరెక్టర్ గా పాలరాజు అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాకినాడ ఎస్పి విక్రాంత్ పార్టీ కర్నూలు ఎస్పీగా బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, ఏసీబీ డైరెక్టర్గా జయలక్ష్మి, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీస్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు, ఏపీఎస్పీ కర్నూలు సెకండ్ బెటాలియన్ కమాండెంట్ గా దీపిక, కోఆర్డినేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ ఎస్పీగా సుబ్బారెడ్డిని బదిలీ చేశారు. కాకినాడ ఎస్పీగా విందు మాధవ్, కడప ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ నియమితులయ్యారు.
* ఐపీఎస్ లకు స్థానచలనం
ఇంటలిజెన్స్ ఎస్పీగా రమాదేవి( Rama Devi ), విజయవాడ డిసిపి గా సరిత, ఎస్ సి ఆర్ బి, సిఐడిఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి, శ్రీధర్ నియమితులయ్యారు. విశాఖపట్నం డిసిపి గా కృష్ణ కాంత్ పటేల్, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా ధీరజ్ కునుబిల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా జగదీష్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్రావు, సిఐడి ఎస్పీగా శ్రీదేవి రావు, పి టి ఓ డి ఐ జి గా సత్య యేసు బాబు, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డిఐజిగా అనుభూరాజన్, డిఐజిగా అట్టాడ బాబ్జీ, ఏపీఎస్పీడీసీగా ఫకీరప్ప, సిఐడి ఎస్పీగా చక్రవర్తి బదిలీ అయ్యారు.