https://oktelugu.com/

Vundavalli Arunkumar : ఆ సక్సెస్ పవన్ దే.. తేల్చిచెప్పిన ఉండవల్లి 

బీజేపీ తో కలిసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా బీజేపీకి మద్దతు ఇవ్వబోమని పవన్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే జనసేన ను కూడా శ్వేతపత్రం అడుగుతున్నట్లు ఉండవల్లి చెప్పుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 5, 2023 / 09:03 PM IST
    Follow us on

    Vundavalli Arunkumar : సమకాలిన రాజకీయ అంశాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఆయన మరోసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు. పవన్ తో పాటు మార్గదర్శి విచారణపై తనదైన రీతిలో స్పందించారు. ఆది నుంచి ఉండవల్లి పవన్ పై సానుకూలత వ్యక్తం చేస్తూ వచ్చారు. పవన్ నిజాయితీని మెచ్చుకుంటూ వచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు.
    ఏపీలో ఒకరకమైన వాతావరణాన్ని సృష్టించడంలో పవన్ సక్సెస్ అయ్యారని ఇండైరెక్ట్ గా ఉండవల్లి ఒప్పుకున్నారు. పొత్తుల విషయంలో పవన్ చర్యలతోనే కన్ఫ్యూజన్ ఏర్పడిందన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు తమ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాయని పరోక్షంగా బీజేపీ నాయకత్వాల మార్పును ప్రస్తావించారు. పవన్ ను ఒక అంచనా వేయలేక బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉందని ఉండవల్లి మాటలు తెలియజేస్తున్నాయి.
    మార్గదర్శి కేసుల విషయంలో వైసీపీ సర్కారు గట్టిగానే పోరాడుతోందని అభినందించారు. ఈ విషయంలో మిగతా రాజకీయ పక్షాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. మార్గదర్శిపై తన పోరాటానికి ఇన్నాళ్లకు ఒక తుది రూపం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ, వైసీపీ. జనసేన శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.
    అలాగే పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ లో బాధ్యుల్ని ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి కోరారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలన్నారు.కేంద్రం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై వైసీపీ, టీడీపీ , జనసేన శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన కోరారు. బీజేపీ తో కలిసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా బీజేపీకి మద్దతు ఇవ్వబోమని పవన్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే జనసేన ను కూడా శ్వేతపత్రం అడుగుతున్నట్లు ఉండవల్లి చెప్పుకొచ్చారు.