https://oktelugu.com/

Karimnagar: అర్ధరాత్రి కుక్కల అరుపులు.. బయటకు వచ్చి చూస్తే షాక్.. ఏం జరిగిందంటే?

దీంతో అటవీ శాఖ అధికారులు అలెర్టయ్యారు. హైనాను బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా హైనాను పట్టుకొని మూగజీవాలను రక్షించాలని తిమ్మాపూర్ మండల వాసులు కోరుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 5, 2023 / 08:56 PM IST
    Follow us on

    Karimnagar : నోటినిండా రక్తంతో హైనా కలకలం సృష్టించింది. కుక్కను పిక్కుతింటూ ఉండగా గ్రామస్థుల కంటబడడంతో వారు భయంతో వణికిపోయారు. అక్కడ నుంచి పరుగులు తీశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.  గత కొంతకాలంగా మూగ జీవాలపై దాడులు చేస్తూ హతమార్చుతూ వస్తున్న హైనా. ఏకంగా జనారణ్యంలోకి రావడం చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

    తిమ్మాపూర్ మండలంలో గత కొంతకాలంగా హైనా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆరుబయట కట్టిన పశువులను, పొలాల్లో గొర్రెల మందలపై దాడిచేసి పొట్టన పెట్టుకుంటోంది. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గత రాత్రి మల్లాపూర్ గ్రామంలోకి హైనా ప్రవేశించింది. వీధి కుక్కలపై దాడిచేసింది. కుక్కల అరుపులకు ఇళ్లను బయటకు వచ్చిన వారు షాక్ కు గురయ్యారు. కుక్కను నోట కరుచుకొని హైనా కొరుక్కు తింటున్న తీరు చూసి భయపడిపోయారు. హైనాను తరిమే ప్రయత్నం చేశారు.

    అయితే కొందరు యువకులు హైనా కుక్కను తింటున్న ఫొటోలు, వీడియోలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. సోషల్ మీడియాలో పెట్టారు. అవి ఇప్పడు వైరల్ అవుతున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అలెర్టయ్యారు. హైనాను బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా హైనాను పట్టుకొని మూగజీవాలను రక్షించాలని తిమ్మాపూర్ మండల వాసులు కోరుతున్నారు.