https://oktelugu.com/

AP Election Survey 2024: ఏపీలో గెలిచేది ఆ పార్టీ.. ఆర్ఎస్ఎస్ సర్వేలో సంచలన ఫలితాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్..చేపట్టిన అంతర్గత సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో వైసిపి మరోసారి విజయం అందుకోనుందని.. ఆర్ఎస్ఎస్ ప్రకటన విడుదల చేసిందంటూ ఒక ఫోటోను జతచేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 31, 2024 / 09:44 AM IST

    AP Election Survey 2024

    Follow us on

    AP Election Survey 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నారు. అయితే అందరి దృష్టి ఏపి పైనే ఉంది. మరోసారి జగన్ సీఎం అవుతారా? ప్రజలు చంద్రబాబుకు చాన్స్ ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఏపీలో ఎన్నికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ఒక సర్వే చేపట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెగ వైరల్ అవుతోంది. మరోసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వేలో పేర్కొన్నారు.అయితే లాజికల్లీ ఫాక్ట్ చెక్ సంస్థ నిజమా? కాదా? అన్నదానిపై అధ్యయనం చేసింది. అందులో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్..చేపట్టిన అంతర్గత సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో వైసిపి మరోసారి విజయం అందుకోనుందని.. ఆర్ఎస్ఎస్ ప్రకటన విడుదల చేసిందంటూ ఒక ఫోటోను జతచేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.57% ఓట్లతో వైసీపీ 159 సీట్లు దక్కించుకుంటుందని.. 36% ఓట్లతో టిడిపి 15 స్థానాల్లో గెలుపొందుతుందని.. జనసేన ఒక స్థానానికి పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ఏప్రిల్ 25 నుంచి మే 5 మధ్య చేపట్టారని.. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లతో ఈ సర్వే ప్రక్రియ కొనసాగిందనిస్పష్టం చేశారు.సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం, మహిళా ఓట్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు ఉందని తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు బర్ల సుందర్ రెడ్డి పేరిట ఈ ప్రకటన జారీ అయినట్లు చూపించారు. అయితే ఈ ప్రకటనను షేర్ చేసిన నెటిజన్.. బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తొలిసారిగా ఈ సర్వే చేపట్టిందని.. తన అఫీషియల్ వెబ్సైట్లో సైతం పొందుపరిచిందని క్యాప్షన్ ఇచ్చారు.

    అయితే ఇది ఫ్యాక్ట్ చెక్ చేయగా ఫేక్ అని తేలింది. ఆర్ఎస్ఎస్ ఇటువంటి సర్వే చేయలేదని స్పష్టం అయ్యింది. ఆర్ఎస్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించగా.. అందులో ఎటువంటి సర్వే కనిపించడం లేదు. గూగుల్ సెర్చ్ చేసిన ఎక్కడా జాడలేదు. పైగా సదరు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులను సంప్రదించగా.. తాము అటువంటి సర్వే చేయలేదని.. అదంతా ఫేక్ అని.. ఆర్ఎస్ఎస్ పేరిట ఫేక్ సర్వేలు విడుదల చేస్తే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఓటింగ్ పెరిగిన తరుణంలో వైసీపీకి ఏకపక్ష విజయం సాధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సర్వేను చూసిన నెటిజన్లు సైతం ఇదే సందేహం వ్యక్తం చేశారు. అయితే ఈ సర్వే వెనుక వైసిపి నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.