Srikakulam: శ్రీకాకుళం( Srikakulam) జిల్లాను భూప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం( Ichapuram ) పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున భూమి కంపించింది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే వరుసగా ఈ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించడం పరిపాటిగా మారింది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా ఇక్కడ ప్రకంపనలు వెలుగు చూశాయి. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అయితే కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. రెండేళ్ల కిందట కూడా ఇక్కడ తరచూ ప్రకంపనలు వెలుగు చూశాయి. ఈ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎటువంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ప్రధానంగా బహుదా నది తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
* ఎక్కువగా తీర ప్రాంతంలో..
జిల్లాలో తరచూ భూప్రకంపనలు వెలుగు చూస్తుండడం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం( seashore area ) ఉంది. దాదాపు 11 మండలాల్లో ఈ తీరం విస్తరించి ఉంది. వందలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుద నదులు ఉన్నాయి. ఈ పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువగా భూప్రకంపనలు వెలుగులోకి వస్తున్నాయి. భూ అంతర్భాగంలో కదలికలు వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో రణస్థలం( rangasthalam ) మండలంలో ప్రకంపనలు వెలుగు చూసాయి. ఎచ్చెర్ల మండలంలో సైతం తరచూ ప్రకంపనలు వస్తుంటాయి. అయితే అంత తీవ్రత పెద్దగా కనిపించడం లేదు.
*పరిశ్రమలపై వ్యతిరేకత
జిల్లాలో భూప్రకంపనలతో పాటు సునామీ( Tsunami ) భయంతోనే ఎక్కువ మంది పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ( Congress government)హయాంలో సోంపేట బీల ప్రాంతంలో అణు విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ అదే ఏర్పాటు అయితే.. విపత్తులు తప్పవన్న హెచ్చరికలు ఉన్నాయి. ఆ భయంతోనే పరిశ్రమల ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమల ఏర్పాటుతో భూకంపాలు, సునామీలు తప్పవన్న హెచ్చరికలు జిల్లా ప్రజలపై బలంగా పనిచేసాయి. పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా మార్చాయి.
* ప్రజల్లో ఆందోళన
అయితే జిల్లాలో( Srikakulam district) తరచూ ప్రకంపనలు వెలుగు చూస్తుండడం మాత్రం ప్రజల్లో ఆందోళనకు కారణం అవుతోంది. ప్రతి నెల ఏదో ఒక మండలంలో భూమి కంపిస్తూనే ఉంది. అయితే దీనిపై అధికారులు ఆరా తీయడం చేస్తున్నారు. కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. భూ అంతర్భాగంలో మార్పులతోనే ఇలా కంపిస్తోందని చెప్పుకొస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు.