Thalliki Vandanam
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు నాయకుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకం అమలుపై దృష్టిపెట్టారు. సూపర్ సిక్స్‌లో ఒకటైన తల్లికి వందనంతోపాటు స్టూడెంట్ కిట్‌ను సైతం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. ఎన్నికల సమయంలో 1 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంపేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే ఆర్థిక సాయం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15వేలు ఆర్థిక సాయంతోపాటు స్టూడెంట్ కిట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హామీ అమలుపై ఎన్డీఏ సర్కార్ దృష్టి పెట్టింది.
మార్గదర్శకాలు జారీ..
ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఎన్డీఏ ప్రభుత్వం ’తల్లికి వందనం’కార్యక్రమం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసింది. ఆధార్ కార్డు ప్రామాణికంగా లబ్ధిరులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇక పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థుల హాజరు శాతం కచ్చితంగా 75 శాతం ఉండాలని నిబంధన విధించింది. ఈ పథకం కింద ప్రతీ విద్యార్థికి ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తుంది. పథకంలో భాగంగా స్టూడెంట్ కిట్ కూడా అందించనుంది.
తెరుచుకున్న పాఠశాలలు…
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకుని నెల రోజులు కావస్తోంది ఈ నేపథ్యంలో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలని ఆదేశించింది. ఆధార్ లేనివారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. అది జారీ అయ్యే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈమేరు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆధార్ లేకపోతే ఈ కార్డులు తప్పనిసరి..
ఇక ఆధార్ లేనివారు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పొందాలంటే లబ్ధిదారులకు విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ఇక ఆధార్ జారీ అయ్యే వరకూ ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్టూడెంట్ కిట్ కింద ఇచ్చేవి ఇవే..
తల్లికి వందనం పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి… పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే విద్యార్థుల హాజరు శాతం 75 గా ఉండాలని కండీషన్ విధించింది. ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగు, మూడు జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Thalliki vandanam scheme soon in ap efforts are being made to implement the scheme government has released guidelines
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com